Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఇప్పుడే పాఠశాలలు తెరిస్తే వైరస్ విజృంభణకు అవకాశం ఇచ్చినట్టే: వీకే పాల్…

ఇప్పుడే పాఠశాలలు తెరిస్తే వైరస్ విజృంభణకు అవకాశం ఇచ్చినట్టే: వీకే పాల్
-పాఠశాలలను తెరవడం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడమే అని హెచ్చరిక
-పూర్తిస్థాయి రక్షణ కల్పించిన తర్వాతే పాఠశాలలను తెరవాలి
-పాఠశాలలు ఎప్పుడు తెరవాలన్న నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది
-తొందర పడి పాఠశాలలు తెరిచి విద్యార్థలను ఇబ్బందులకు గురిచేయవద్దు

కరోనా తగ్గుముఖం పట్టడంతో అనేక రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేశాయి. కొన్ని రాష్ట్రాలు ఇంకా ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ పరిమిత ఆంక్షలు పెట్టాయి . మరికొన్ని పూర్తిగా లాక్ డౌన్ ఎత్తి వేసి స్కూళ్లను కూడా తెరవాలని నిర్ణయించు కున్నాయి. ఈ నేపథ్యం లో నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ రాష్ట్రప్రభుత్వాలు హెచ్చరికలు చేశారు… తొందరపడి స్కూళ్ళు తెరవద్దని తెలిపారు. విద్యార్థులు , ఉపాధ్యాయులు ఒకే దగ్గర చేరటం వల్ల పొంచి ఉన్న ప్రమాదం తో కొత్త చిక్కులు వస్తాయని అన్నారు. ప్రభుత్వాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పాఠశాలలు తెరవలో లేదో నిర్ణయించుకోవాలని అన్నారు…..

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. కొన్ని నిబంధనలతో పాఠశాలలు తిరిగి తెరవాలని కూడా ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే, ఈ నిర్ణయం సరికాదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. కొవిడ్ పరిస్థితులను అంచనా వేయకుండా పాఠశాలలను తెరవడం ఏమంత మంచిది కాదని పేర్కొన్నారు. ఇది విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుందని హెచ్చరించారు.

పాఠశాలలో టీచర్, హెల్పర్, విద్యార్థులు అందరూ ఒకే చోట ఉంటారని, ఫలితంగా వైరస్ వ్యాప్తికి మరింత అవకాశం ఇచ్చినట్టు అవుతుందని అన్నారు. కాబట్టి ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించి రక్షణ కల్పించిన తర్వాతనో, లేదంటే వైరస్ దాదాపు కనుమరుగైన తర్వాతనో ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గతంలో స్కూళ్లు తెరిచినప్పుడు కూడా వైరస్ విజృంభించిందని గుర్తు చేశారు.

ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యలతోపాటు ప్రజలు క్రమశిక్షణగా ఉండడం వల్లే ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోందన్నారు. ఇప్పుడు మళ్లీ స్కూళ్లు ప్రారంభమైతే వైరస్‌ చెలరేగిపోవడానికి మళ్లీ అవకాశం ఇచ్చినట్టు అవుతుందని వీకేపాల్ వివరించారు. కాబట్టి ఈ విషయంలో తొందరపాటు వద్దని హెచ్చరించారు. పాఠశాలలు ఎప్పుడు తెరవాలన్న నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, రెండు మూడు మంత్రిత్వశాఖలు కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకుంటాయని పాల్ పేర్కొన్నారు.

Related posts

ప్రజల ప్రాణాలకన్నా ప్రచారానికే మోడీ ప్రాధాన్యత …. ప్రియాంక మండిపాటు

Drukpadam

కణాల్లోకి కరోనా చొరబడకుండా అడ్డుకునే కొత్త యాంటీబాడీ అభివృద్ధి!

Drukpadam

కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచండి: ప్రధాని మోదీ!

Drukpadam

Leave a Comment