Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపండి: ఏపీకి కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశం

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపండి: ఏపీకి కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశం
-ఏపీ జలవనరుల కార్యదర్శికి కృష్ణా బోర్డు లేఖ
-డీపీఆర్ సమర్పించి, ఆమోదం పొందేంత వరకు పనులు నిలిపివేయాలని ఆదేశం
-ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేసిందన్న బోర్డు
-జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పనులను పరిశీలించమన్నది
-కాని ఎపి సర్కార్ అందుకు అంగీకరించలేదని ఆరోపణ
-వివాదాల నడుమ ప్రాజక్టు పనులు నిలిపివేయాల్సిందే అను ఆదేశం

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలానికి ఎగువున చేపట్టిన రాయలసీమ ఎత్తి పోతల పథకాన్ని తక్షణమే నిలిపివేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది . ఇప్పటీకే అనేక వివాదాల నడుమ నడుస్తున్న ఈ ప్రాజెక్టు పనలతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు కృష్ణనది యాజమాన్య బోర్డు కు లేఖ రాసింది. అంతకు ముందు పర్యావరణం దెబ్బతింటుందని గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా పర్యావరణం దెబ్బతినేలా ఉన్న ప్రాజెక్టు చేపట్టరాదని తీర్పునిచ్చింది . అయినప్పటికీ ప్రాజక్టు పనులు జరుగుతున్నాయని తెలంగాణ ఆరోపణ . దీనిపై కృష్ణనది యజమాన్యబోర్డు సభ్యులను వెళ్లి పరిశీలించి నివేదిక అందజేయాలని కోరింది . ఎపి ప్రభుత్వం తమకు అక్కడికి వెళ్లందుకు అవకాశం ఇవ్వడంలేదని అందువల్ల వెళ్లలేక పోయామని బోర్డు ట్రిబ్యునల్ కు తెలిపింది . తెలంగాణ ప్రభుత్వం బోర్డు కు లేఖ రాయడంతో తిరిగి బోర్డు ఎపి సర్కార్ ను రాయలసీమ ఎత్తి పోతల పథకం పనులను నిలిపి వేయాలని లేఖ రాసింది……….

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లవద్దని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) సమర్పించిన తర్వాత దానికి ఆమోదం లభించేంత వరకు పనులు నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు బోర్డు సభ్యుడు హెచ్‌కే మీనా ఏపీ జలవనరుల కార్యదర్శికి లేఖ రాశారు. పనులు చేపట్టవద్దంటూ ఫిబ్రవరిలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఈ లేఖలో గుర్తు చేశారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు జరుగుతున్నాయో, లేదో చెప్పాలని అప్పట్లో జాతీయ హరిత ట్రైబ్యునల్ కృష్ణాబోర్డు నిపుణుల కమిటీని ఆదేశించింది. అయితే, నిపుణుల కమిటీ పర్యటనకు ఏపీ అవకాశం ఇవ్వడం లేదని పేర్కొన్న మీనా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పించాలని, అది ఆమోదం పొందాకే ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లాలని ఆ లేఖలో స్పష్టం చేశారు.

Related posts

తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం… 12 మంది రాజీనామా!

Drukpadam

సిద్ధరామయ్య కేబినెట్లోకి 24 మంది కొత్త మంత్రులు.. ఎవరెవరు, ఏయే సామాజికవర్గాలకు చెందినవారంటే..?

Drukpadam

వైసీపీ దోపిడీదార్లతో టీడీపీ యుద్ధం: నారా లోకేశ్

Ram Narayana

Leave a Comment