Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీఎం కావాలనే తొందర లేదు.. : డీకే శివకుమార్…

సీఎం కావాలనే తొందర లేదు.. : డీకే శివకుమార్
-పార్టీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం
-సీఎం అభ్యర్థిపై తలో ప్రకటన చేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ నేతల
-ఈ విషయాన్ని సిద్ధరామయ్య చూసుకుంటారన్న శివకుమార్
-బీజేపీకి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలని సూచన

 

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు తలో ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కావాలనే తొందర తనకు లేదని శివకుమార్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. తన సేవలను పార్టీ హైకమాండ్ ఎలా ఉపయోగించుకోవాలన్నా… ఆ బాధ్యతలను నిర్వహించేందుకు తాను సిద్ధమని తెలిపారు.

తమ పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను తాను చూశానని… అయితే, ఈ విషయాన్ని తమ పార్టీ లెజిస్లేటివ్ నేత సిద్ధరామయ్య చూసుకుంటారని శివకుమార్ చెప్పారు. సిద్ధరామయ్య ఆ పని చేయకపోయినా… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సజీవంగానే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఏ సీటు ఖాళీగా లేదని చెప్పారు. పార్టీకి చెందిన నేతలందరూ బీజేపీకి వ్యతిరేకంగా కలసికట్టుగా పోరాటం సాగించి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని సూచించారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కన్నా ఎక్కువసీట్లు గెలిచినప్పటికీ బీజేపీకి అధికారం దక్కకూడదన్న కారణంతో ,జేడీఎస్ ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది … కొంత కాలం సరిగానే ఉన్న ఇరువురి కాపురం కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు కొందరు బీజేపీకి మద్దతు పార్టీకటించడంతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్, జేసీఎస్ లకు చెందిన 17 మంది శాసనసభ్యులు బీజేపీ కి మద్దతు ప్రకటించారు.

బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి యడియూరప్ప పై కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకొని ముఖ్యమంత్రిని మార్చే ప్రశక్తి లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ అంతర్గత పోరు సమసి పోలేదు. పైగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గుచూపారు. దీంతో కాంగ్రెస్ కు తిరిగి అధికారం తీసుకుని రావాలనే పట్టుదలతో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పని చేస్తున్నారు. దీంతో మా ముఖ్యమంత్రి అభ్యర్థి డీకే శివకుమార్ అని కొందరు ఎమ్మెల్యేలు ప్రకటించడంతో శివకుమార్ స్పందించారు.

Related posts

మాది ప్రజాబలం…లక్షమందితో కొత్తగూడెం సభ …ఖమ్మం మీడియా సమావేశంలో కూనంనేని …

Drukpadam

ఆ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి: బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండ్…

Drukpadam

ఈ నెల 18న గులాబీ గూటికి మోత్కుపల్లి!

Drukpadam

Leave a Comment