Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆంధ్రాపై నీటి యుద్ధం కొత్తడ్రామా?సీఎల్పీ నేత భట్టి

ఆంధ్రాపై నీటి యుద్ధం కొత్తడ్రామా?సీఎల్పీ నేత భట్టి

-కేసీఆర్ వీ మోసపు మాటలు -మంత్రులతో డ్రమాలు:సీఎల్పీ నేత భట్టి
-ఏపీ ప్రాజెక్టులపై ఏడాది క్రితమే హెచ్చరించాం
-కేసీఆర్, మంత్రుల మాటలు హాస్యాస్పదం
-నీటి కోసం సాధించుకున్న తెలంగాణలో కృష్ణా నది నుంచి నీరేదీ?

 

టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంత్రి కేసీఆర్ ఆయన మంత్రులు.. తెలంగాణను కాపాడేందుకు నీళ్ల యుద్ధం చేయబోతున్నట్లుగా కొత్త డ్రామాకు లేపారని ….. ఇది అంత వట్టి బూటకం ,నాటకం తప్ప మరేమి కాదని తెలంగాణ శాసనసభ పక్ష కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. హైద్రాబాద్ లోని శాసనసభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ , ఈ విషయమై ఏడాది క్రితమే శాససభ సాక్షిగా ప్రభుత్వాన్ని హెచ్చరించాం… మా మాటలను ఎగతాళి చేశారు…. పెడచెవిన పెట్టారు…. ఫలితంగా జరగలిసిన నష్టం జరిగింది….. ఆంధ్రప్రదేశ్ సర్కార్ పోతిరెడ్డిపాడు ఎక్సటెన్షషన్ తో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం కు అవకాశం కల్పించి …. ఇప్పుడు తెలంగాణ నీటి కోసం ఆంధ్రప్రదేశ్ తో యుద్ధం చేస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మండి పడ్డారు. నీటి వాటాల విషయంలో రాష్ట్రము నష్ట పోకుండా చూడాల్సిన భాద్యత ఉన్న ప్రభుత్వం అందుకు సరైన చర్యలు తీసుకోలేదని ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ భాద్యత వహించాలని డిమాండ్ చేశారు…. తెలంగాణ నీటి హక్కులను ఫణంగా పెడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం,ప్రజల పక్షాన ,ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

తెలంగాణ చెందాల్సిన చుక్క నీటి బొట్టును కూడా వదులుకోము.. అవసరమైతే యుద్దం చేస్తాం.. అంటూ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య నెలకొన్న నీటి సమస్యపై కేసీఆర్ ప్రభుత్వం సాచివేత ధోరణి విడనాడాలని అన్నారు.

ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిప్ట్ సంగమేశ్వరం పేరుమీద నీళ్లు తీసుకునిపోయేందుకు సంవత్సరం కిందటే జీ.ఓ ఇచ్చింది. సంగమేశ్వరం నుంచి రోజుకు మూడు టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి రోజుకు 80 వేల క్యూసెక్కుల నీళ్లు తరలించేందుకు సిద్ధమైందని అన్నారు . రోజుకు 11 టీఎంసీల నీటిని తీసుకునిపోతున్నారని దీనివల్ల భవిషత్ లో ఖమ్మం ,నల్గొండ జిల్లాలు ఎడారి కావడం తధ్యమని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల ,నిధులు ,నియామకాల కోసం. నీళ్లు ,నియామకాలు లేవు … నీళ్ల విషయం లో ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రలేవండి.. పోరాటం చేయండని.. మొత్తుకున్నా పట్టించుకోలేదు ప్రభుత్వ చర్యలను తూర్పార బట్టారు .

దొంగలు పడ్డ అరునెలకు కుక్కలు మోరిగినట్లు.. కుక్కలైనా ఆరునెల్లకు మోరుగుతాయి…. టీఆరెస్ ప్రభుత్వం- నేతలు ఏడాదికి మేలుకున్నారని అదికూడా డ్రామాలాగా ఉందని సందేహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు నష్టం వస్తుందని కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీలు చెప్పిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. నీటిమీద, నదులు మీద అవగాహన ఉన్న మేధావులంతా నెట్టి నోరు మొత్తుకున్నా పెడచెవిన పెట్టిన సర్కార్ ను ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ముుఖ్యమంత్రి కేసీఆర్ పేరుకు మాత్రం తెలంగాణ ప్రయోజనాలు అంటాడు.. కానీ ఆయన కుటుంబ ఆర్థిక ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమ లేవని విమర్శించారు.

రామలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టు పేరుమీద ఏపీ ప్రభుత్వం జీ.ఓ ఇచ్చిన తేదీ.. 5.5.2020. దీనికి సరిగ్గా నెల ముందు 8.4.2020 నాడు మన రాష్ట్ర ఈ.ఎన్.సీ మురళీధర్ రావు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్ సామర్థ్యాన్ని రెండు టీఎంసీల నుంచి 1 టిఎంసీకి తగ్గించాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసిన విషయాన్నీ గుర్తు చేశారు.

మన ప్రభుత్వం రెండు టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి సామర్థ్యాన్ని తగ్గించుకుంది. తెలంగాణ తగ్గించుకుంటుంటే.. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. రాయలసీమ సంగమేశ్వరం పేరుతో నీళ్లను ఏపీ తరలించుకుపోతే ఖమ్మం జిల్లాలోని నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టు తీవ్రంగా నష్టపోతుంది. లెఫ్ట్ కెనాల్ రొజుకు ఒక్క టీఎంసీ పారితే.. అక్కడ 11 టీఎంసీలు తరలిపోతాయని అన్నారు .

సంగమేశ్వరం నుంచి నీళ్లు తరలిపోతే శ్రీశైలం నిండేదెప్పుడు, శ్రీశైలమే నిండకపోతే.. ఆ ప్రాజెక్టు మీద ఆధారపడ్డ పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, భీమా, కోయిల్ సాగర్, ఎస్.ఎల్.బీ.సీ లు ఎప్పుడు నిండుతాయి.. ఎప్పుడు పారతాయి. వాటిమీద ఆధారపడ్డ లక్షలాది ఎకారల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు .

 

ఇప్పటికే లెప్ట్ సాగర్ లెప్ట్ కెనాల్ కింద ఆయకట్టులో ఉన్న ఆరున్నల లక్షల ఎకరాలు కూడా ఎండిపోతాయి. మొత్తం కలిపితే.. దాదాపు 28 లక్షల 50 వేల ఎకరాలకు నష్టం జరుగుతుంది. దానికి తోడు హైదరాబాద్ కు మంచినీళ్లు వచ్చే అవకాశం కూడా ఉండదని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర జలశక్తి కమిటీ, అపెక్స్ కమిటీ మీటింగ్ చేస్తే వెళ్లకుండా తాత్సారం చేశారని ఆరోపించారు . కేంద్ర జల శక్తి శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులను మొదలు పెట్టక ముందే అపెక్స్ మీటింగ్ కు పిలిస్తే టెండర్లు అయ్యేదాక కావాలని ఆలస్యం చేయడంపై మండిపడ్డారు . ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం టెండర్లు పూర్తయ్యే వరకూ కేసీఆర్ అపెక్స్ మీటింగ్ వద్దని కావాలని తెలంగాణ ప్రయోజనాలకు ఫణంగా పెట్టారని ప్రభుత్వ చర్యలను గర్హించారు.

అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టే నాటికి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పడం, పనులు మొదలయిన తరువాత.. ఇప్పుడు నిద్ర లేచి.. టీఆర్ఎస్ మంత్రులు, కేసీఆర్ డ్రామాలు మొదలు పట్టారని అన్నారు .  మీ కళ్లముందే అన్ని జరుగుతున్న నిద్రపోయి.. మీకు సంబంధించిన కాంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రయోజనాలకు ఫణంగా పెట్టారని ధ్వజమెత్తారు . నీళ్ల కోసం తెచ్చుకున్న తెలంగాణలో కృష్ణా బేసిన్ లో ఒక్క ఏకరానికి కూడా కేసీఆర్ సర్కార్ నీళ్లు ఇవ్వలేదన్నారు .

మీరు మొదలు పెట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి కానీ ఇతరత్రా కొత్త ప్రాజెక్టుల ద్వారా క్రుష్ణానదిపైనుంచి కొత్తగా ఒక్కఎకరాకు నీళ్లు ఇవ్వలేదని అన్నారు . లక్షల కోట్లు ఖర్చుచేసినా కొత్త ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వక పోవడం పైగా ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం విడ్డురంగా ఉందని అన్నారు .

కేసీఆర్ తుపాకీ రామునిలా ఊర్లపొంట తిరుగుతూ ప్రగల్బాలు పలుకుతున్నారు.

 

రెండు పారాసెట్ మాల్ ట్యాబ్లెట్లు వేసుకుంటే కోవిడ్ తగ్గుతుంది అంటే సీఎం ట్రీట్మెంట్ తీసుకునే హాస్పిటల్ లో 28లక్షలు ఎలా వసూళ్లు చేస్తోంది అని భట్టి ప్రశ్నించారు . ముఖ్యమంత్రి కేసీఆర్ భూత వైద్యం వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయని అన్నారు . కేసీఆర్ నిర్లక్ష్యపు మాటల వల్లే అధికారులు నిద్రపోయారని ఫలితంగా రాష్ట్రంలో కరోనా తో ప్రజలు అనేకమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు హామీలు ఇస్తూ ప్రజల్ని మభ్యపెట్టడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని అన్నారు . కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాని వాసాలమర్రి..లేదంటే నేను పుట్టిన ఊరు కు ఇచ్చి ..మిగతా గ్రామాలను ఎండబెడతాం అంటే ఎలా. వాటికి ఇచ్చిన్నట్లే మిగిలిన అన్ని గ్రామాలకు ఇవ్వాలని భట్టి డిమాండ్ చేశారు.

Related posts

కేసీఆర్ సొంత పొలంలో పండిస్తున్న వరి ధాన్యాన్ని ఏ ఐకేపీ సెంటర్ లో అమ్మారు? రేవంత్ రెడ్డి

Drukpadam

జో బైడెన్ ను ఎట్టి పరిస్థితుల్లో చంపరాదని నాడు అల్ ఖైదాను ఆజ్ఞాపించిన లాడెన్!

Drukpadam

దేశంలోనే సంపన్న సీఎం జగన్: చంద్రబాబు!

Drukpadam

Leave a Comment