Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో టెంపుల్ ఎక్స్‌పో .. ముగ్గురు ముఖ్యమంత్రుల రాక

  • తిరుపతికి రానున్న మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు
  • మహాకుంభ్ ఆఫ్ టెంపుల్స్ సదస్సును ప్రారంభించనున్న ఏపీ సీఎం చంద్రబాబు
  • నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్ షాప్‌ల నిర్వహణ

తిరుపతిలో ముగ్గురు ముఖ్యమంత్రులు పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే 19 వ తేదీ వరకు టెంపుల్ ఎక్స్ పో 2025 జరగనుంది. 

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌..ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్ షాప్ లు నిర్వహిస్తారు. 

దాదాపు 58 దేశాల్లోని సుమారు 1581 భక్తి సంస్థల భాగస్వామ్యంతో ఈ ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో‌ను మహాకుంభ్ ఆఫ్ టెంపుల్స్‌గా తిరుపతిలోని ఆశా కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు.  

Related posts

జ‌గ‌న్ పారిస్ ప‌ర్య‌ట‌న‌కు సీబీఐ కోర్టు అనుమ‌తి!

Drukpadam

స్వపక్షం, ప్రతిపక్షం అనేవి రాజకీయాల్లోనే ఉంటాయి, తమకు అందరూ సమానమే: చిన్నజీయర్ స్వామి!

Drukpadam

శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు!

Drukpadam

Leave a Comment