Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

నేడు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. హాజరవుతున్న కేసీఆర్!

  • ఈ ఏడాది 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న బీఆర్ఎస్
  • తెలంగాణ భవన్ లో ఈరోజు విస్తృతస్థాయి సమావేశం
  • పార్టీ నిర్మాణం, సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్న నేతలు

చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాహ్యప్రపంచంలోకి వస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరవుతుండడంతో దీనిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. ఈ ఏడాది 25వ వసంతంలోకి ప్రవేశించబోతోంది. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. 

ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ లు, జిల్లా అధ్యక్షులు, ఇతర విభాగాల అధ్యక్షులు హాజరవుతున్నారు. ఈ సమావేశం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు. 

Related posts

కాంగ్రెస్ టిక్కెట్ కేటాయింపులు.. తెలంగాణ నేతలకు ఢిల్లీ నేత కీలక సూచన

Ram Narayana

బర్రెలక్క ప్రచారానికి యానాం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రూ. లక్ష సాయం

Ram Narayana

కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే ఉద్యోగం పోతుందని రేవంత్ రెడ్డికి భయం: కేటీఆర్

Ram Narayana

Leave a Comment