Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

న్యూస్ ఇన్ బ్రీఫ్ ……

 

నేటి నుంచి దుబాయ్ కి ఇండియా విమాన సర్వీసులు

నేటి నుంచి దుబాయ్ కి ఇండియా విమాన సర్వీసులు
-గత రెండు నెలలుగా భారత్ నుంచి విమాన సర్వీసుల పై నిషేధం
-వచ్చే వారం నుంచి సర్వీసులు తిరిగి అందుబాటులోకి
-యూఏఈ ధ్రువీకరించిన రెండు డోసులు తీసుకుంటునే అనుమతి
-ఆర్టీపీసీఆర్ టెస్టుల అనుమతి తప్పని సరి

భారత్ నుంచి దుబాయ్ కి కరోనా విజృంభణ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు మళ్లీ నేటి నుంచి మొదలుకానున్నాయి. దేశంలో వైరస్ ప్రభావం అంతకంతకూ తగ్గుతున్న నేపథ్యంలో యునైటెడ్ ఎమిరేట్స్‌కు చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ వచ్చే వారం నుంచి సేవలను పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. అదే విధంగా భారత్ విమానాలపై నిషేధం విధించారు . కరోనా ఉదృతి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ 25న దుబాయ్-భారత్ మధ్య విమాన సేవలు నిలిచిపోయాయి. తిరిగి విమాన ప్రయాణాలకు ఎమిరేట్స్ పచ్చజెండా ఊపింది .దీంతో జూన్ 24 నుంచి భారత్ కు విమాన సర్వీసులు నడిపేందుకు ఎమిరేట్స్ సిద్ధమైంది . దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా తమ ప్రయాణాలను కొనసాగించే అవకాశం ఏర్పడింది .

ప్రస్తుతం దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాలు , భారతదేశ ప్రయాణికుల కోసం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తాజాగా ఎమిరేట్స్ సంస్థ తెలిపింది. భారత ప్రయాణికులు వారి రెసిడెన్స్ వీసాతోపాటు యూఏఈ ధ్రువీకరించిన రెండు కరోనా టీకా డోసులను తీసుకున్న వారికి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణించేందుకు అనుమతి లభిస్తుందని పేర్కొంది. ప్రయాణానికి ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షకు సంబంధించి నెగటివ్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి అని స్పష్టం చేసింది.

భారత్ లో కరోనా విజృంభించడంతో వివిధ దేశాలనుంచి విమాన సర్వీసులను ఆయా సంస్థలు నిషేధించాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదట పడటంతో తిరిగి అంతర్జాతీయ సంస్థలు తమ సర్వీసులను నిలిపి వేశాయి.

 

మావోయిస్టులు అడవిని వీడండి: ఎస్పీ కోటిరెడ్డి

 

 

మహబూబాబాద్: నిషేధిత మావోయిస్టు పార్టీలో అగ్రనేతలతో సహా కిందిస్థాయి సభ్యులు కరోనాతో బాధపడుతున్నారని, వీరికి పోలీస్ శాఖ తరఫున వైద్యం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి తెలిపారు.
బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ………
జిల్లాలోని గంగారాం మండలం మడగూడెం గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ ఆలియాస్ హారిభూషన్ గుండెపోటుతో మరణించినట్లు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు.
మావోయిస్టు పార్టీ నేతలు కూకటి వెంకన్న, శారద, సోను, వినోద్, నందు, ఇడుమ, దేవె, మూల దేవేందర్ రెడ్డి, దామోదర్, భద్రులు కరోనా వ్యాధితో బాధపడుతున్నారనే సమాచారం ఉందని చెప్పారు.
పోలీసు శాఖ తరఫున వైద్యం అందిస్తామని, కావున కరోనా సోకిన మావోయిస్టులు అడవిని వదిలి బయటకు రావాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి చెందుతున్న నాగరికత సమాజంలో వెనుకబడిన సిద్ధాంతాలతో నష్టపోకూడదని ఎస్పీ కోటిరెడ్డి సూచించారు.

 

జ్యోతిష్కుడి ఇంట్లో రూ.18 కోట్ల విలువైన నకిలీ నోట్లు

 

నాగోల్‌లోని జ్యోతిష్కుడు బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ ఇంట్లో జరిగిన రంగురాళ్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.
రంగురాళ్ల కేసు ఇన్వెస్టిగేషన్‌లో ఇంటి దొంగే పెద్ద నకిలీ నోట్లు చెలామణి చేసే వ్యక్తిగా ఎల్‌బీ నగర్, సీసీఎస్ పోలీసులు తేల్చారు.
మురళీకృష్ణ శర్మ గతంలో 90 కోట్ల హవాలా మనీ సీబీఐ కేసులో జైలుకి వెళ్లి వచ్చిన నిందితుడని పోలీసుల విచారణలో తేలింది.
ఇతనితో పాటు మరో ఆరుగురు ప్రాపర్టీ ఆఫన్డర్స్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు మురళీకృష్ణ నుంచి 6 లక్షల నగదు, మిగిలిన ఆరుగురు నుంచి 32 వేల నగదు, ఒక కట్టర్, కారు, 10 మొబైల్స్, రూ. 18 కోట్ల విలువైన నకిలీ 2000 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

వేపదండలు ధరించి రైతుల ఇండ్ల వద్ద అర్థ నగ్న నిరసన దీక్ష

 

జిల్లా కలెక్టర్, ఆర్ డి ఓ పట్టించుకోనందుకు నిరసన

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం లోని అన్నారం, సంగెమ్ ఐ కే పి సెంటర్ నిర్వాహకుల దోపిడీ పై చర్యలు తీసుకోవాలి .ఒక్కొక్క క్వింటాల్ కు 10 కేజిల చొప్పున తరుగుక్రింద దాన్యాన్ని తగ్గిస్తామని రైతులకు బెదిరింపులు తగ్గింపులకు ఒప్పుకోకపోతే ధాన్యం వాపస్ పంపిస్తామని గాండ్రింపు ,అన్యాయంగా డ్రైవర్ బేటా క్రింద క్వింటాల్ కు రు 10, హమాలి కూలీ క్రింద క్వింటా ల్ కు రు.39 వసూల్ చేసి రషీదులు ఇవ్వడం లేదు.ధాన్యం కొనుగోళ్లకు ట్రక్ రషీదులు ఇవ్వకుండా వేధింపులు

తూకం లో మోసం చేస్తూ రైతుల కడుపు కొడుతున్న అన్నారం, సంగెమ్ ఐ కే పి సెంటర్లుఐ కే పి సెంటర్ల మోసాలపై పిర్యాదులు ఇచ్చి వారం రోజులైనా బాధ్యతలు మరచిన కలెక్టర్, ఆర్ డి ఓఒక్కకిలోకూడా తరుగుక్రింద కట్ చెయ్యకుండా డబ్బులు ఇప్పించాలని అధికారులకు రైతుల విజ్ఞప్తులు

రైతుల న్యాయమైన డిమాండ్ల పై సూర్యాపేట కలెక్టర్, ఆర్ డి ఓ లు చర్యలు చేపట్టాలని, ఐ కే పి సెంటర్ల మోసాలపై విచారణ చేసి బాద్యులపై చర్యలు తీసుకోవాలని, రైతుల జీవితాలతో ఆదుకోవద్దని ప్రజావాణి పార్టీ కోరుతూ రైతుల దీక్షకు మద్ధతు ఇస్తుంది

దీక్ష లో తన్నీరు వెంకన్న,పూసపెల్లి శ్రీను, గోపగాని వెంకట రామ్ నర్సయ్య, కే. విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ….

మహిళా లాకప్ డెత్..ముగ్గురు పోలీసులపై వేటు

 

యాదాద్రి భువనగిరి జిల్లాలో రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో మహిళ లాకప్ డెత్ కేసు కలకలం సృష్టించింది.

ఈ కేసులో ఎస్సై మహేష్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యపై చర్యలు తీసుకున్నారు రాచకొండ పోలీస్‌ కమిషనర్ మహేష్ భగవత్.

ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మూడురోజుల క్రితం అడ్డగూడూరు పీఎస్‌లో పోలీస్ దెబ్బలు తట్టుకోలేక మరియమ్మ అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే.

దీనిపై పెద్ద దుమారమే జరిగింది దీంతో మరియమ్మ మృతిపై ఉన్నతాధికారులతో సమగ్ర దర్యాప్తు నిర్వహించిన సీఐ ఎస్సై , కానిస్టేబుళ్ల పాత్ర తేలతడంతో ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రేషన్ బియ్యాన్ని పట్టుకున్న సర్పంచ్

రామకృష్ణాపురం: చింతకాని మండలం లోని రామకృష్ణాపురం గ్రామంలోని కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 15 కిలోల రేషన్ బియ్యాన్ని అక్రమంగా అర్ధరాత్రి ఊరి చివర లో తరలిస్తున్న సమయములో డీలర్ పగిడిపల్లి రవీంద్రబాబుని సర్పంచ్ కన్నెబోయిన కుటుంబరావు సుమారు 30 కింటాలు బియ్యాన్ని పట్టుకొని స్వాధీనపరుచుకున్నారు. వివరాల్లోకి వెళితే రామకృష్ణాపురం రేషన్ షాప్ డీలర్ పగిడిపల్లి రవీంద్రబాబు గత కొంత కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయంపై గ్రామస్తులు ఫిర్యాదు మేరకు సర్పంచ్ కుటుంబరావు రవీంద్ర బాబు హెచ్చరించాడు. అయినప్పటికీ డీలర్ వ్యవహార శైలి లో ఎటువంటి మార్పు లేదు. రామకృష్ణాపురం గ్రామంలో 95 మంది చనిపోయారు. ఆ చనిపోయిన వారి పేర్లు తొలగించలేదు. అయితే చనిపోయిన వారికి వస్తున్న రేషన్ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా తన ఖాతాలో వేసుకొని ఇలా అక్రమంగా దొడ్డిదారి పట్టిస్తున్నాడు. 95 మంది చనిపోయిన వారికి రేషన్ ఇవ్వాలని సర్పంచ్ పలుమార్లు రవీంద్రబాబు చెప్పినప్పటికీ సర్పంచ్ మాట లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు . ఈ విషయంపై సర్పంచ్ పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది . ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో గత రాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సర్పంచ్ నిఘా వేసి పట్టుకోవడం జరిగింది. కష్టకాలంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమ మార్గాన తరలివెళ్లడం పట్ల గ్రామస్తులు ఆగ్రహంతో ఉన్నారు . ప్రభుత్వం పేదల పక్షపాతిగా వ్యవహరిస్తూ అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొస్తుంటే ఇలాంటి అక్రమార్కులు వల్ల ప్రభుత్వ లక్ష్యం కాస్త దెబ్బతీస్తుంది . ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇటువంటి అక్రమార్కులు పట్ల కఠినంగా వ్యవహరించాలని రామకృష్ణాపురం గ్రామస్తులు కోరుతున్నారు . పట్టుకున్న రేషన్ బియ్యాన్ని ఇంటెలిజెంట్ ఇన్స్పెక్టరగారు కి చింతకాని మండల తాసిల్దార్ కి సర్పంచ్ పట్టించుకో జరిగింది.

 

రూ 10 లక్షలతో లొంగిపోయిన మావోయిస్టు కమాండర్

 

రీంనగర్: మావోయిస్టులపై ఇటీవల వరుసగా దాడులు జరుగుతున్న క్రమంలో కొందరు లొంగుబాటు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ ప్లాటూన్ కమాండర్ అక్కడి పోలీసుల ముందు లొంగిపోయారు.
ఎక్స్‌టెన్షన్ ప్లాటూన్ కమాండర్‌గా పని చేస్తున్న దివాకర్ అలియాస్ కిషన్ కవర్ధ ఎస్పీ శాలభ్ సిన్హా ఎదుట లొంగిపోయారు.
ఆ సమయంలో దివాకర్ వద్ద రూ.10 లక్షల నగదు, నాలుగు వందల రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయి.
ప్లాటూన్ కమాండర్ లొంగిపోయిన విషయాన్ని మధ్యప్రదేశ్ పోలీసులు అధికారికంగా వెల్లడించారు.

 

రోడ్ల భవనాలశాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసిన సీతక్క

 

ఈ రోజు హైదరాబాద్ లో రోడ్ల భవనాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గం లో అంతర్గత రోడ్లు మరియు పాత రోడ్లు గ్రామాలకు గ్రామాలకు ఉండే లింక్ రోడ్లకు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ములుగు నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం అని కనీస రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని ములుగు ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయాలని లేఖ లో పేర్కొన్నారు.

 

సీఎం గారు మీరు ఏమైనా డాక్టరా?: దాసోజు శ్రావణ్

 

ప్రజల పట్ల     అప్రమత్తతను, జాగ్రత్తలను సూచించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం కేసీఆర్ కరోనా పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించేలా మాట్లాడారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు.
గతంలోనూ ఒకసారి ఇలాగే మాస్క్‌ల పట్ల కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు.
సెకండ్ వేవ్ సమయంలో తెలంగాణలో కొన్ని లక్షల మంది చనిపోయారన్నారు.
కేవలం గ్రేటర్ హైదరాబాద్‌లోనే లక్ష మంది చనిపోయి ఉంటారని, కానీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని శ్రవణ్ మండిపడ్డారు.
ప్రజల్ని చైతన్య పరచాల్సిన సీఎం కరోనా లేదని, బ్లాక్ ఫంగస్ లేదంటున్నారని చెప్పారు.
పారాసెటమాల్, డోలో చాలు అంటూ నోటికొచ్చింది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చశారు.
ముఖ్యమంత్రి గారు మీరేమైనా డాక్టరా? అని శ్రవణ్ ప్రశ్నించారు.
ప్రజలకు భయం పోవడం వల్లనే కరోనా వ్యాప్తి ఎక్కువ అయిందన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని కొనసాగించడం కోసమే సీఎం ఇలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
త్వరలో టీపీసీసీ కొత్త నాయకత్వంపై ప్రకటన ఉంటుందని భావిస్తున్నానని దాసోజు శ్రవణ్ తెలిపారు.

 

మరియమ్మ కుటుంబానికి న్యాయం చేకూరేలా చూడాలి భాజపా జిల్లా నాయకులు డాక్టర్ శీలం పాపారావు .

నిందితులను కఠినంగా శిక్షించాలి

 

ఖమ్మం : సామాజిక వర్గానికి చెందిన దళిత మహిళ మరియమ్మ హత్య కేసుపై న్యాయ వ్యవస్థతో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ శీలం పాపారావు గారు బుధవారం నాడు ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు . ఆమెది సహజమరణం కాదని , ఎటువంటి అరెస్ట్ నోటీసులు ఇవ్వకుండా మరియమ్మను అరెస్టు చేసి చిత్ర హింసలకు గురిచేసిన పోలీస్ల పై హత్య కేసు నమోదు చేసి వారి కుటుంబానికి న్యాయం చేకూరేలా చూడాలని , చట్టం ఎవరికీ చుట్టం కాదని చట్టం ముందు అందరూ సమానులేనని మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని న్యాయవ్యవస్థను ఒక ప్రకటన రూపంలో కోరారు . వారి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు .

 

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై ఈసీ మూడేళ్ల నిషేధం

 

2019 ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ
నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించని వైనం
గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్

కేంద్రమాజీ మంత్రి బలరాం నాయక్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన ఆయన ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించలేకపోయారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మూడేళ్లపాటు చట్టసభలకు పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. బలరాం నాయక్ 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

Related posts

జార్ఖండ్‌ అడ‌వుల్లో తుపాకుల మోత…ఒక జవాన్ మృతి …మరొకరికి సీరియస్….

Ram Narayana

కోడలి రహస్య భాగాల్లో ఇనుప రాడ్డుతో కాల్చి.. కారంపొడి చల్లిన భర్త, అత్తమామలు!

Ram Narayana

పోలీసు దిగ్బంధంలో అమలాపురం.. పట్టణంలోకి వచ్చే అన్ని దారుల మూసివేత!

Drukpadam

Leave a Comment