ఎవరిని పడితే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు…ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే …
అవకాశాల వాదులకు అసలు చోటు ఇవ్వవద్దు
పార్టీ కోసం కస్టపడి ఎంతోకాలం జెండా మోస్తున్నవారికి ప్రాధాన్యత ఇవ్వండి
పార్టీలో చేరేవారి గతాన్ని చూడండి…
కాంగ్రెస్ పార్టీలోకి ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దని ,వారి వివరాలు తెలియకుండా అసలు చేర్చుకోవద్దని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే పిసీసీలకు స్పష్టం చేశారు …కొందరు పదవులకోసమే అవకాశవాదంతో పార్టీలో చేరి పదవులు పొంది తిరిగి పార్టీ లో పదవి లేకపోతె వేరే పార్టీలో చేరుతున్నారు …ఇది అన్ని పార్టీల్లో ఉంది దీనిపై ఖర్గే సందేశం పార్టీ శ్రేణులకు కనువిప్పు కలిగేదిగా ఉంది …
కాంగ్రెస్ పార్టీలో చేరే వారి విషయంలో తొందరపాటు వద్దు, పార్టీలో చేరే వారి గతాన్ని కూడా చూడాలన్నారు .. గతంలో వారు ఏ పార్టీలో ఉన్నారు, ఆ..పార్టీ అధికారం కోల్పోగానే, ఆ..పార్టీని ఎందుకు వీడినారో పరిశీలించాలని తెలిపారు .. అలాంటివారు ఏ పార్టీ అధికారంలోఉంటే ఆ పార్టీకే వెళ్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు … అటువంటి వాళ్లను పక్కన పెట్టండి.., పార్టీకోసం కష్టకాలంలో పనిచేసిన వారికే ప్రాదాన్యత ఇవ్వాలని అన్నారు ..
కాంగ్రెస్ పార్టీ అంటే నిజంగా అభిమానించే వారిని, కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసేవారిని, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నిరాశతో ఉన్నవాళ్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోండని కోరారు .. అధికారంలో ఏ..పార్టీ ఉంటే ఆ.. పార్టీలోకి మారే వారిని తొందరపడి చేర్చుకుంటే..!, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యతను, పదవులను ఇస్తూపోతే ,వాళ్లు మన కష్ట సమయంలో మళ్లీ పార్టీని వదిలి పారిపోతారు.., జాగ్రత్త సుమా అంటూ హెచ్చరించారు ..ఖర్గే ప్రకటన పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు ఒక భరోసాను ఇవ్వగా కొత్తగా వచ్చినవారికి మింగుడుపడనిదిగా ఉండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…