Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రసవత్తరంగా మారిన మా ఎన్నికలు :అధ్యక్ష బరిలో పలువురు ప్రముఖులు…

రసవత్తరంగా మారిన మా ఎన్నికలు :అధ్యక్ష బరిలో పలువురు ప్రముఖులు
సాధారణ ఎన్నికల తలపిస్తున్న మా ఎన్నికల హంగామా
ఎత్తులు పై ఎత్తులతో వ్యూహాత్మకంగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు
‘మా’ ఎన్నికలకు తన టీమ్​ ను ప్రకటించిన ప్రకాశ్​ రాజ్​
27 మందితో జాబితా విడుదల
టీంలో జయసుధ, శ్రీకాంత్, సాయికుమార్ తదితరులు
నటీనటుల బాగు కోసం పనిచేస్తానన్న ప్రకాశ్ రాజ్
-మంచు ,విష్ణు , జీవిత, హేమాలు పోటీలో ఉంటామని ప్రకటన

 

తెలుగు నటీనటుల సంఘం ‘మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)’ అధ్యక్ష పదవికోసం గతంలో ఎన్నడూ లేని విధంగా రసవత్తర పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కొంత మంది సినీ ప్రముఖులు కూర్చొని పాలనా వారు అధ్యక్షులు అంటే ఒకే అనే పరిస్థితి నుంచి పదవి కోసం పోటీ పడే స్థితికి మా చేరుకున్నది … ఈ సారి అనూహ్యంగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పేరు తెరపైకి వచ్చింది . ఇప్పటికే ప్రకాశ రాజ్ తన టీం ను సైతం ప్రకటించారు. అధ్యక్ష బరిలో తాము ఉంటామని చెబుతున్నా మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు , జీవిత , హేమ లు తమ టీంలను ప్రకటించాల్సి ఉంది. ఎవరును వారు ఎత్తులు పై ఎత్తులతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు మరింత సమయం ఉన్న మన మా ఎన్నికలు మాత్రం అమెరికా లో తానా ఎన్నికలను తలపిస్తున్నాయి.

‘మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించారు. 27 మందితో జాబితాను విడుదల చేశారు. అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన మొదటి వ్యక్తి మంచు విష్ణు. ఆ తర్వాత తానూ పోటీ చేస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఆ వెంటనే జీవితా రాజశేఖర్, నటి హేమలూ బరిలోకి దిగుతున్నామన్నారు.

ఈ నేపథ్యంలోనే త్రిముఖ పోరు కాస్తా.. చతుర్ముఖ పోరుగా మారిపోయింది. ఎన్నికలను రసవత్తరంగా మార్చేసింది. ఈ క్రమంలోనే ఈ రోజు ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యుల పేర్లను ప్రకటించారు. ‘మా’ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాత్మక ఆలోచనలతో ‘మా’ ప్రతిష్ఠను నిలబెడతానన్నారు. నటీనటుల బాగు కోసం పనిచేస్తానని చెప్పారు.

ప్రకాశ్ రాజ్ టీమ్ ….

ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీశ్, ప్రగతి, అనసూయ, సన, అనితా చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవి ప్రకాశ్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేశ్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేశ్ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్ రావులు ఉన్నారు. అందరికంటే ముందే ప్రకాష్ రాజ్ తన టీం ను ప్రకటించడం విశేషం ….

Related posts

హ‌రీశ్ రావు అధ్య‌క్ష‌త‌న తెలంగాణ మంత్రివ‌ర్గ ఉప సంఘం కీల‌క‌ భేటీ!

Drukpadam

హైదరాబాద్ పర్యటనపై మోదీ ట్వీట్!

Drukpadam

ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా వంతు …రేపే విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు …

Drukpadam

Leave a Comment