Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట :సజ్జల రామకృష్ణారెడ్డి…

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట :సజ్జల రామకృష్ణారెడ్డి
-చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారం వెలుగు చూశాక జగన్ పై 30 కేసులు :
-సీఎం జగన్ కేసుల ఎత్తివేతపై సజ్జల స్పందన
-కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులని వెల్లడి
-గత పదేళ్లుగా కుట్రలు జరుగుతున్నాయని వివరణ
-పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబునాయుడు దిట్ట అని వ్యవస్థలలో ఉన్న కీలక వ్యక్తులను జగన్ ని డిఫెమ్ చేయడానికి, ఆయనపై కుట్రలకు వాడుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ పై నమోదైన కేసుల ఎత్తివేత అంశంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీఎం జగన్ పై గతంలో కేసులు నమోదు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారం వెలుగు చూశాక, జగన్ పై ఇష్టం వచ్చిన రీతిలో 30 కేసుల వరకు నమోదయ్యాయని వెల్లడించారు. అవి అసలు కేసులే కాదని పేర్కొన్నారు.చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని పేర్కొన్నారు .

గత 10 సంవత్సరాలుగా జగన్ పై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు వీరంగం వేస్తున్నాయని అన్నారు. కొన్ని చానళ్లు దుష్ప్రచారం సాగిస్తున్నాయని, కేసులు వేస్తూ రాష్ట్ర సర్కారు పనితీరుకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని తెలిపారు.

గతంలో టీడీపీ నేతలపై ఉన్న కేసులను చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసిందని, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నేర్పరి అని సజ్జల పేర్కొన్నారు. వ్యవస్థల్లోని కీలక వ్యక్తులను కుట్రలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా పథకం ప్రకారం అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని వెల్లడించారు.

తెలంగాణ నేతలు విద్వేషాలు పెంచేలా మాట్లాడుతున్నారు: ప్రాజెక్టులపై సజ్జల స్పందన

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల అంశంపైనా సజ్జల స్పందించారు. కొందరు తెలంగాణ నేతలు విద్వేషాలు పెంచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆవేశంతో, పరుషంగా మాట్లాడడం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదని హితవు పలికారు. తెలంగాణ నేతలు మాట్లాడే మాటలను వారి విచక్షణకే వదిలేస్తున్నామని తెలిపారు. తాము వారి కంటే ఎక్కువే మాట్లాడగలమని, కానీ అందువల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ తెలంగాణ సీఎంతో కలిసి ప్రాజెక్టులపై చర్చించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని సజ్జల స్పష్టం చేశారు. అలాగని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని అన్నారు.

Related posts

అమరావతి నుంచి అరసవిల్లికి యాత్రపై ఘూటుగా స్పందించిన స్పీకర్ తమ్మినేని …

Drukpadam

పార్టీలు ఫిరాయించడంలో గోవా ఎమ్మెల్యేల రికార్డు!

Drukpadam

ఐదేళ్లూ ఆయనే సీఎం….మంత్రి పాటిల్ కీలక వ్యాఖ్యలు..

Drukpadam

Leave a Comment