Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వాసాలమర్రిలో సీఎం స్నేహితురాలు ఆగమ్మకు అస్వస్థత!

వాసాలమర్రిలో సీఎం స్నేహితురాలు ఆగమ్మకు అస్వస్థత!
-వాసాలమర్రిలో 18 మందికి అస్వస్థత.. వాంతులు,
-విరేచనాలతో ఇబ్బంది పడిన గ్రామస్థులు
-వాసాలమర్రిలో 2500 మందితో కలిసి కేసీఆర్ సహపంక్తి భోజనం
-వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరిన ఆగమ్మ
-ఆహారం కలుషితం కావడం కారణం కాదన్న వైద్యాధికారులు
-ఆహారం పడకపోవడం వల్లనే వాంతులు అయి ఉండవచ్చు డాక్టర్ల అనుమానం

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో మంగళవారం నిర్వహించిన సహపంక్తి భోజనం చేసిన వారిలో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సీఎం పక్కన కూర్చుని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ సీఎం సభ అనంతరం వాంతులు చేసుకుంది. రాత్రి మరోమారు వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను భువనగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో నిన్న డిశ్చార్జ్ చేశారు. ఆమె ను తన స్నేహితురాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభాముఖంగా ప్రకటించారు.

సహపంక్తిలో భోజనం చేసిన ఓ బాలిక బుధవారం అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అదే రోజు డిశ్చార్జ్ చేశారు. అలాగే గ్రామానికి చెందిన మరో 16 మంది కూడా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో విలవిల్లాడిపోయారు. విషయం తెలిసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని ఇంటింటికి తిరుగుతూ వైద్యం అందించారు. గ్రామస్థుల అస్వస్థతకు ఆహారం కలుషితం కావడం కారణం కాదని అధికారులు తెలిపారు. సహపంక్తిలో మొత్తం 2500 మంది పాల్గొన్నారని, వారిలో 18 మంది మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు.

బాలికతోపాటు మరో 17 మందికి వాంతులు, విరేచనాలు
ఆగమ్మ ఆరోగ్యం మెరుగుపడటంతో గురువారం డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రకాశ్ తెలిపారు. కాగా, బుధవారం ఓ బాలిక అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన అనంతరం బాలికను ఇంటికి పంపించారు. గ్రామంలో మరో 16 మంది కూడా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధ పడుతుండటంతో వైద్య అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు

వాసాలమర్రిలో ఇంటింటికీ వైద్య పరీక్షలు
ఈ క్రమంలో బుధవారం ఇంటింటా తిరిగి అనారోగ్యానికి గురైనవారికి మెరుగైన వైద్యం అందించినట్లు తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) వైద్యాధికారి చంద్రారెడ్డి తెలిపారు. గ్రామస్తుల అస్వస్థతకు ఆహారం కలుషితం కావడం కారణం కాదని, సహపంక్తి భోజనంలో 2500 మంది పాల్గొనగా.. కేవలం 18 మంది మాత్రం అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. తీసుకున్న ఆహరం పడకపోవడం వల్లే ఇలా జరిగివుంటుందని వెల్లడించారు. కాగా, వాసాలమర్రిలో మంగళవారం సీఎం సహపంక్తి భోజనాలతోపాటు బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే.

 

Related posts

జడ్జి హత్యపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ

Drukpadam

ఇన్ స్టాగ్రామ్ లో లోపాన్ని పట్టేసి భారీ నజరానా కొట్టేసిన షోలాపూర్ కుర్రవాడు!

Drukpadam

నవంబరు నుంచి వాట్సాప్ సేవలు ఈ క్రింద మొబైల్స్‌లో బంద్ కానున్నాయి!

Drukpadam

Leave a Comment