Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

దళితులపై దాడులకు ఖమ్మం లో నిరసన….

దళితులపై దాడులకు ఖమ్మం లో నిరసన.
-మరియమ్మ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
– సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి……
– రిటెర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి ఆకునూరి మురళి డిమాండ్…

ఖమ్మం : మరియమ్మ లాక్ డెత్ పై రాష్ట్రవ్యాపితంగా నిరసనలు వెల్లు ఎత్తుతున్నాయి. మరియమ్మను దొంగతనం పేరుతో అకారణంగా అరెస్ట్ చేసి చిత్ర హింసియాలకు గురిచేసి ఆమె మరణానికి కారణమైన వారిపై మర్డర్ కేసు పెట్టి ,విచారణ జరిపించి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ పెరుగుతుంది.అన్ని పార్టీలు మరియమ్మ మరణంపై స్పందించాయి .ఖమ్మం లో దళిత సంఘాలు , దళిత మేధావులు స్పందించారు. ఆమె కుటుంబానికి ఎక్సగ్రేషయో తో పాటు సంఘటనపై సిగ్గింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

చింతకాని మండలం కోమట్ల గూడెం గ్రామానికి చెందిన మరియమ్మ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు పోలీసు స్టేషన్ లో లాకప్ డెత్ కు గురైన దళిత మహిళ మరియమ్మ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను తక్షణమే ప్రకటించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని , హత్యకు పాల్పడిన వారిపై ఎస్సి , ఎస్టీ అట్రాసిటీ కేసు , హత్యానేరం కేసులను నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపైన జరుగుతున్న దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు . సమాజంలో అగ్రకుల ఆధిపత్య దాడులు ఒకపక్క పెరిగిపోతుంటే వాటిని అరికట్టాల్సిన పోలీసులే దళిత మహిళను అతిక్రూరంగా చిత్రహింసలకు గురి చేసి పోలీసులు కొట్టిన దెబ్బలకి పెట్టిన హింసలకు మరియమ్మ ఈనెల 18న అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కుళ్లపొడిచి హత్య చేయడం దుర్మార్గమని , అంతటితో ఆగకుండా ఆమె కుమారుడైన ఉదయ్ కిరణ్ ని వెన్నుముక కింది భాగంలో దారుణంగా కుల్లపొడిచి అవయవాలపైన గాయపర్చి హత్యాయత్నం చేయడం శోచనీయమన్నారు . మరియమ్మ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించి , ఆమె కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని కోరారు .దళిత మహిళ అంబడిపుడి మరియమ్మ అడ్డగుడూరు పోలిస్ లాకప్ హత్యకు నిరసనగా గురువారం ఖమ్మం అంబెడ్కర్ సర్కిల్లో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో భాగంగా ఆకునూరి మురళి , డాక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో సంకల్ప హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడిని కలిసి పరామర్శించడం జరిగింది .ఈ కారక్రమంలో ప్రజా భహుజన సామాజిక కార్యకర్తలు ఆకునూరి మురళి రిటైర్డ్ ఐ ఏ స్ , డా ” గోపినాధ్ , గడ్డం జాన్సీ అడ్వకేట్ , భాగ్యలక్ష్మీ జాతీయ రాష్ట్ర దళిత స్త్రీ కో ఆర్డినేటర్స్ , పల్లా రాజశేఖర్ , పాల్వంచ రామారావు , లింగాల రవికుమార్ , డా. కె వి కృష్ణారావు , స్వర్ణకుమారి , భద్రునాయక్ , ఎం ఎం రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ , తాళ్లపల్లి రవి , రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్ష కార్యదర్శులు పిట్టల భాగ్యమ్మ , పెరుమల్ల దనమ్మ , కందుల ఉపేందర్ , జోకబ్ , కె వి పి స్ నుండి మనోహర్ , కుక్కల సైదులు ,
బీఎస్పీ నుండి మిర్యాల నాగరాజు , నాగేశ్వర్ రావు , దామల్ల సత్యం , విజయ్ , గురుమూర్తి , అంబెడ్కర్ సంగం నాయకులు కనకయ్య , ఎర్ర గంగాధర్ , బట్టపోతుల కిరణ్ , కొట్టే సుధాకర్ , సంజీవరావు , రాధాకృష్ణ , మెండెం రమణ , జోస్నా , జి శ్రీనివాసరావు , డిబిస్ నుండి చేకూరి చైతన్య, స్వరోస్ / టిజిపిఏ నాయకులు రమణ , బాలరాజు, అప్పారావు , పే బ్యాక్ అంబెడ్కర్ సొసైటీ వారితో పాటు రాష్ట్ర / జిల్లా ప్రజా , భహుజన సామాజిక సంఘాల నాయకులు , కార్యకర్తలు పెద్దమొత్తంలో హాజరయినారు .

మరియమ్మ లాక్ డెత్ పై కాంగ్రెస్ పార్టీ డీజీపీ ని కలిసింది. సంఘటనపై విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని టీపీసీసీ అధ్యక్షడు , ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , ఎమ్మెల్యే సీతక్క , తదితరులు డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు.

సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు , సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు లు మరియమ్మ మరణాని తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు ఉదయకిరణ్ పరామర్శించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లాక్ డెత్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు …బీజేపీ నేతలు కూడా కుటుంబసభ్యులను కలిసి మద్దతు తెలిపారు . ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు.

Related posts

40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు….

Drukpadam

 సైబర్ నేరగాళ్ల నయా మోసం.. కరెంటు బిల్లు పెండింగ్ ఉందంటూ మెసేజ్‌లు.. స్పందిస్తే ఖేల్ ఖతం!

Ram Narayana

అశ్లీల చిత్రాల కేసు.. ఐదు నెలల్లోనే రూ. 1.17 కోట్లు సంపాదించిన రాజ్‌కుంద్రా!

Drukpadam

Leave a Comment