Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

సైబరాబాద్ కమిషనర్‌పై చర్యలకు కేసీఆర్‌కు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

-తన అరెస్ట్ విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించారు
-గచ్చిబౌలి పోలీసుల నుంచి అనుమతి తీసుకోకుండానే అరెస్ట్ చేశారు
-సీఐడీ అధికారులకు గచ్చిబౌలి పోలీసుల సహకరించారు
-ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ మోదీ, అమిత్ షాకు లేఖలు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజు అరెస్టు విషయంలో సైబరాబాద్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాయడం సంచలంగా మారింది . వివరాలు ఇలా ఉన్నాయి ……
సైబరాబాద్ కమిషనర్, గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్లపై క్రమశిక్ష చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఏపీసీబీసీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేసిన సమయంలో వీరు నిర్లక్ష్యంగా వ్యవహరించాని ఆ లేఖలో ఆరోపించారు.

సీబీసీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ అంతర్రాష్ట్ర న్యాయ నిబంధనలు ఉల్లంఘించారని, తన అరెస్ట్ సమయంలో నిబంధనల ప్రకారం గచ్చిబౌలి పోలీసుల నుంచి సీబీసీఐడీ అధికారులు అనుమతి తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదని, ఆ విషయాన్ని తాను చెబితే ఫోన్‌లో మాట్లాడి ఏదో తూతూమంత్రంగా సమాచారం అందించారని పేర్కొన్నారు.

తన నివాసానికి వచ్చిన వారిని గచ్చిబౌలి పోలీసులు గుర్తించలేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తన అరెస్ట్ విషయంలో ఏపీ సీబీసీఐడీతో గచ్చిబౌలి పోలీసులు కూడా కలిసిపోయారని ఆరోపించిన రఘురామరాజు ఈ విషయంపై విచారణ జరిపించాలని సీఎంను కోరారు.

అలాగే, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు కూడా రఘురామ రాజు లేఖలు రాశారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారని ఆ లేఖలో ఎంపీ పేర్కొన్నారు.

Related posts

రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు…

Drukpadam

ఒక్క పబ్ పైనే దాడులు చేయడం అనుమానాలు కలిగిస్తోంది: విజయశాంతి

Drukpadam

డల్లాస్, డెన్వర్‌లలో కాల్పులు.. 8 మంది మృతి

Drukpadam

Leave a Comment