డీఎంకే అవినీతి అక్రమాలపై ప్రజలు తిరగబడతారు …డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి
దక్షణాది పేరుతో కేంద్రంపై తప్పుడు ప్రచారంపై మండిపాటు
డీఎంకే అవినీతి అక్రమాలను పక్కదారి పట్టించేందుకు స్టాలిన్ పడరాని పాట్లు
డీలిమిటేషన్ పై ఇంకా విధివిధానాలు ఖరారు కాకముందే విమర్శలు హాస్యాస్పదం
డీఎంకే ఎన్ని పిల్లి మొగ్గలు వేసిన 2026 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం …

డీఎంకే అవినీతి అక్రమాలు దుష్పరిపాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేపీ జాతీయ నాయకులు తమిళనాడు ,కర్ణాటక బీజేపీ సహా ఇంచార్జి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు … తమిళనాడు బీజేపీ అధ్యక్షులు కె .అన్నామలై అధ్యక్షతన ఆదివారం డీఎంకే ప్రజావ్యతిరేక పాలనకు నిరసనగా తిరుచిరాపల్లి మిలిటరీ గ్రౌండ్ లో జరిగిన భారీ బహిరంగసభలో డాక్టర్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ డీఎంకే ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు …రాష్ట్రంలో స్టాలిన్ పాలన గాడితప్పిందని ప్రజల్లో తమకు వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని దుయ్యబట్టారు …అందులో భాగంగానే దక్షణాదికి డీలిమిటేషన్ లో సీట్లు తగ్గుతున్నాయని ఆరోపణలు చేయడంపై విమర్శలు గుప్పించారు …డీలిమిటేషన్ లో విషయంలో విధివిధానాలు ఖరారు కాకముందే తప్పుడు ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు … విద్యావిధానంపై ,భాషపై ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయడాన్ని డాక్టర్ రెడ్డి ఖండించారు …తమిళనాడులో 2026 జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు …బీజేపీకి తమిళనాడు వస్తున్న ఆదరణ చూసి డీఎంకే తట్టుకోలేక పోతుందని అన్నారు …ప్రజల్లో బీజేపీ పాలన తెచ్చుకోవడం ద్వారా డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుందని దాని ద్వారా తమిళనాడు అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఆశిస్తున్నారని అన్నారు …నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల ఆదరణ పొందుతున్నాయని అందుకే మోడీజీ నాయకత్వంలో మూడవసారి ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు …మోడీజీకి ప్రపంచ వ్యాపితంగా వివిధ దేశాల్లో విశేష ఆదరణ లబించడాన్ని ఆయన ఉదహరించారు …
సభలో టిఎన్ అసెంబ్లీలో బిజెపి ఫ్లోర్ లీడర్ నాయనార్ నాగేంద్రన్, మాజీ గవర్నర్ లు పొన్ రాధాకృష్ణన్, తమిళశై సౌందరరాజన్ , కేంద్ర మంత్రి హెచ్. రాజా, వానతి శ్రీనివాసన్ ఎమ్మెల్యే, బిజెపి జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, కరుప్పు మురుగానందం, విపి టిడిపి, జోనల్ ఇన్‌ఛార్జ్, జిల్లా బిజెపి అధ్యక్షురాలు ఒండి ముత్తు మరియు ఇతరులు పాల్గొన్నారు.
People will revolt against DMK corruption and irregularities… Dr. Ponguleti Sudhakar Reddy

People will revolt against DMK corruption and irregularities… Dr. Ponguleti Sudhakar Reddy
Angry over false propaganda against the Center in the name of Dakshinadhi
Stalin’s unfounded accusations to sideline DMK corruption and irregularities
Criticism on delimitation is ridiculous even before the procedures have been finalized
How many kittens DMK has planted, BJP is sure to come to power in the 2026 elections…


BJP national leaders Tamil Nadu and Karnataka BJP in-charge and former MLC Dr. Ponguleti Sudhakar Reddy said that the days when people will revolt against DMK corruption and irregularities are near… Dr. Reddy participated in a huge public meeting held at Tiruchirappalli Military Ground on Sunday under the chairmanship of Tamil Nadu BJP president K. Annamalai to protest against the anti-people rule of DMK and flagged the policies of the DMK government…Stalin’s rule in the state has gone astray and the opposition coming to them from the people He accused them of engaging in diversionary politics to gain attention…As part of that, he criticized the allegations that the seats for the South were decreasing in the delimitation…He was furious about the false propaganda being spread before the procedures were finalized in the delimitation issue…Dr. Reddy condemned the false propaganda being spread among the people on the education policy and language…He said that the formation of a government under the leadership of the BJP in the 2026 assembly elections in Tamil Nadu is certain…He said that the DMK will not be able to withstand the support coming to the BJP in Tamil Nadu…He said that he hopes that by bringing the BJP to power among the people, a double engine government will be formed and through it, Tamil Nadu will get a boost in development…He said that the welfare development schemes being implemented at the Center under the leadership of Narendra Modi are getting the support of the people, which is why the government has been formed for the third time under the leadership of Modiji…He cited the fact that Modiji is receiving special support in various countries around the world…
BJP Floor Leader in the TN Assembly in the House Nayanar Nagendran, former Governor Lu Pon Radhakrishnan, Tamilisai Soundararajan, Union Minister H. Raja, Vanathi Srinivasan MLA, BJP National Mahila Morcha President, Karuppu Muruganandam, VP TDP, Zonal In-charge, District BJP President Ondi Muthu and others participated.
डीएमके के भ्रष्टाचार और अनियमितताओं के खिलाफ लोग विद्रोह करेंगे… डॉ. पोंगुलेटी सुधाकर रेड्डी

डीएमके के भ्रष्टाचार और अनियमितताओं के खिलाफ लोग विद्रोह करेंगे… डॉ. पोंगुलेटी सुधाकर रेड्डी
दक्षिणादि के नाम पर केंद्र के खिलाफ झूठे प्रचार पर आक्रोश
डीएमके के भ्रष्टाचार और अनियमितताओं पर ध्यान हटाने के लिए स्टालिन के अकारण हमले
प्रक्रियाओं को अंतिम रूप दिए जाने से पहले परिसीमन पर आलोचना हास्यास्पद है
डीएमके ने कितने बिल्ली के बच्चे पैदा किए हैं? 2026 के चुनावों में बीजेपी का सत्ता में आना तय है…
भाजपा के राष्ट्रीय नेता तमिलनाडु और कर्नाटक भाजपा प्रभारी और पूर्व एमएलसी डॉ. पोंगुलेटी सुधाकर रेड्डी ने कहा कि वह दिन निकट हैं जब लोग डीएमके के भ्रष्टाचार और कुप्रबंधन के खिलाफ विद्रोह करेंगे। डॉ. रेड्डी ने रविवार को तमिलनाडु भाजपा अध्यक्ष के. अन्नामलाई की अध्यक्षता में डीएमके के जनविरोधी शासन के विरोध में तिरुचिरापल्ली सैन्य मैदान में आयोजित विशाल जनसभा में भाग लिया। उन्होंने बैठक में भाग लेते हुए डीएमके सरकार की नीतियों की आलोचना की। उन्होंने कहा कि राज्य में स्टालिन का शासन भटक गया है और वे लोगों से आने वाले विरोध को भटकाने के लिए भटकाव की राजनीति कर रहे हैं। इसके तहत उन्होंने उन आरोपों की आलोचना की कि परिसीमन में दक्षिण के लिए सीटें कम हो रही हैं। वे परिसीमन मामले में प्रक्रियाओं को अंतिम रूप दिए जाने से पहले फैलाए जा रहे झूठे प्रचार से नाराज थे। डॉ. रेड्डी ने शिक्षा नीति और भाषा को लेकर लोगों के बीच फैलाए जा रहे झूठे प्रचार की निंदा की। तमिलनाडु में 2026 के विधानसभा चुनाव में भाजपा के नेतृत्व में उन्होंने कहा कि सरकार बनना तय है… उन्होंने कहा कि तमिलनाडु में भाजपा को मिल रहे समर्थन को डीएमके झेल नहीं पाएगी… उन्होंने कहा कि उन्हें उम्मीद है कि जनता के बीच भाजपा को सत्ता में लाकर डबल इंजन की सरकार बनेगी और इससे तमिलनाडु के विकास को गति मिलेगी… उन्होंने कहा कि नरेंद्र मोदी के नेतृत्व में केंद्र में चलाई जा रही कल्याणकारी विकास योजनाओं का जनता को भरपूर लाभ मिल रहा है, यही वजह है कि मोदी जी के नेतृत्व में तीसरी बार सरकार बनी है… उन्होंने कहा कि दुनिया भर के विभिन्न देशों में मोदी जी को विशेष समर्थन मिल रहा है…
तमिलनाडु विधानसभा में भाजपा के नेता नयनार नागेन्द्रन, पूर्व राज्यपाल लू पोन राधाकृष्णन, तमिलिसाई सौंदरराजन और केंद्रीय मंत्री एच. राजा, विधायक वनथी श्रीनिवासन, भाजपा राष्ट्रीय महिला मोर्चा अध्यक्ष, टीडीपी उपाध्यक्ष करुप्पु मुरुगनंदम, क्षेत्रीय प्रभारी, जिला भाजपा अध्यक्ष ओंदी मुथु और अन्य ने भाग लिया।