తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికలో రాహుల్ మార్క్ …రేవంత్ నియామకం
సీనియర్లను కాదని రేవంత్ వైపే హైకమాండ్ మొగ్గు
ఎట్టకేలకు నిర్ణయం ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ సారథిగా రేవంత్ రెడ్డి
కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఐదుగురికి అవకాశం
జగ్గారెడ్డి, అజర్, గీతారెడ్డిలకు చాన్స్
సీనియర్ల హెచ్చరికలుకూడా లెక్కచేయకుండా పార్టీ హైకమాండ్ టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించటం అనుకున్నదే అయినా సంచలంగా మారింది. సంవత్సరకాలంగా నంచిటు వస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ఎట్టకేలకు జరగడంతో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ లో నెలకొన్న సందిగ్తకు తెరదించినట్లు అయింది. రేవంత్ రెడ్డి ని టీపీసీసీ చీఫ్ గా నియమిస్తే తమదారి తాము చూసుకోవాల్సి వస్తుందని పార్టీని ఇరకాటంలో పెట్టేలా హెచ్చరికలు చేసిని సీనియర్ నేతలు ఎలా స్పందిస్తారో చెందాల్సిఉంది.
తెలంగాణ పీసీసీ నూతన చీఫ్ ఎవరన్న ఊహాగానాలకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించుతూ, టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది. పార్టీ సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ తన చురుకుదనం, పోరాటనైజం వంటి కారణాలతో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి రేసులో అందరినీ వెనక్కి నెట్టినట్టు తెలుస్తోంది. బయటి నుంచి వచ్చిన వాళ్లకు పీసీసీ ఎలా ఇస్తారంటూ వీహెచ్ వంటి నేతలు బహిరంగంగానే ఎలుగెత్తడం తెలిసిందే. నూతన పీసీసీ చీఫ్ గా నియమితులైన నేపథ్యంలో రేవంత్ రెడ్డి… తెలంగాణ కాంగ్రెస్ ను ఎలా నడిపిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.
ఇక, ఇదే క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఐదుగురిని నియమించింది. జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ లను కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఓ ప్రకటనలో పేర్కొంది.
పీసీసీ ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, మల్లు రవి, పోదెం వీరయ్య, సురేశ్, వేం నరేందర్ రెడ్డి, రమేశ్ ముదిరాజ్ లను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలపై ఇన్నాళ్లుగా నాన్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు నిర్ణయాన్ని ప్రకటించి అనిశ్చితికి తెరదించింది.