Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు!

  • ఇప్పటికైతే గడువు పెంచే యోచన లేదన్న మంత్రి
  • ఎల్ఆర్‌ఎస్‌కు ఆశించిన స్పందన కనిపిస్తోందన్న మంత్రి
  • భూభారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయని వెల్లడి

ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి ఎల్ఆర్ఎస్ గడువు పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఆశించిన స్థాయిలో స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. అక్రమ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఎవరూ ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. భూముల రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్ తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. భూమికి మ్యాప్ లేని వారికి కూడా సర్వే చేయించి నిర్ధారిస్తామని తెలిపారు. భూభారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని స్పష్టం చేశారు. దాదాపు వెయ్యి మంది సర్వేయర్లను నియమిస్తామని మంత్రి వెల్లడించారు.

Related posts

తెలంగాణలో మరోసారి ఉద్యోగాల జాతర

Ram Narayana

గోదావరికి పోటెత్తుతున్న వరద… సమీక్ష చేపట్టిన మంత్రి పొంగులేటి…

Ram Narayana

పాలేరు ప్రతిపాదిత రైల్వే లైన్ పై అభ్యంతరం తెలిపిన ఎంపీ రామ సహాయం…

Ram Narayana

Leave a Comment