వైఎస్సార్ ను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు: షర్మిల వార్నింగ్
-టీఆర్ఎస్ నేతలపై షర్మిల ఆగ్రహం
-వైఎస్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదని వెల్లడి
-వైఎస్ గొప్పదనం అందరికీ తెలుసని ఉద్ఘాటన
-లక్షలాది అభిమానులు తిరగబడతారని హెచ్చరిక
ఆంధ్ర తెలంగాణ ల మధ్య నెలకొన్న నీటి వివాదం పై షర్మిల స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ఆర్ ప్రజలకు ఎలాంటి మేలు చేశారో అందరికి తెలుసు …. అలంటి మహానేత పై విమర్శలు చేయడంపై ఆమె ఆగ్రహం ప్రకటించారు. ఇది టీఆర్ యస్ మంత్రులకు తగదని అన్నారు. మీరు విమర్శలు చేస్తే ఇక్కడ ఉన్న ఆయన అభిమానాలు తిరగబడతారు జాగ్రత్త అని హెచ్చరించారు. వై యస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన అనేక పథకాల గురించి చెప్పే మంచి బుద్ది మీకు లేదు . ఆయన ఎవరికీ ఎప్పడు చేదు చేయలేదు … మీరు కావాలని మీరాజకీయ ప్రయోజనాలకోసం రాజశేఖర్ రెడ్డి పేరు లాగటం ఏమాత్రం సమంజసం అనుకోదు. ఆయన ఒక గొప్పనేత ఆయన పై బురదజల్లే పనులు మనుకోండని షర్మిల హితవు పలికారు.
సీఎం కేసీఆర్ సహా, టీఆర్ఎస్ నేతలు మహానేత వైఎస్సార్ ను కించపరిచేలా మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదని ఆమె స్పష్టం చేశారు. వైఎస్సార్ గురించి, ఆయన గొప్పదనం గురించి తెలుగు ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఆరోగ్యశ్రీ సృష్టికర్త వైఎస్సారేనని, అది మంచి పథకం కాబట్టే టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తొలగించలేదని షర్మిల పేర్కొన్నారు.
“మంచి పథకాన్ని తొలగించే ధైర్యం మీకు లేదు. వైఎస్సార్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. మరోసారి చెబుతున్నా… వైఎస్సార్ మహానేత, మనసున్న నేత. మీలాగా కాదు… వైఎస్సార్ నిజమైన ప్రజల నేత. మరోసారి వైఎస్సార్ ను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. కేసీఆర్, టీఆర్ఎస్… ఖబడ్దార్! వైఎస్సార్ ను అవమానించేలా మాట్లాడితే లక్షల్లో ఉన్న ఆయన అభిమానులు తిరగబడతారు” అని షర్మిల హెచ్చరించారు.