Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దళిత్ ఎంపవర్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా: మంద కృష్ణ…

దళిత్ ఎంపవర్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా: మంద కృష్ణ
తెరపైకి దళిత్ ఎంపవర్ మెంట్ అంశం
రేపు ప్రగతిభవన్ లో అఖిలపక్ష సమావేశం
అఖిలపక్ష సమావేశాన్ని స్వాగతిస్తున్నామన్న మంద కృష్ణ
తమను పిలవలేదంటూ అసంతృప్తి

కేసీఆర్ దళిత ఎంపవర్మెంట్ ఒక భూటకం ,నాటకం , కొత్త డ్రామా దళితులపేరుతో ముఖ్యమంతి కేసీఆర్ ఆడుతున్న నాటకంలో భాగమని మాదిగ దండోరా వ్యవస్థాపకులు మహాజన్ సంఘర్షణ సమితి నాయకులూ మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. 2003 అక్టోబర్ 17 న టీఆర్ యస్ ఆధ్వరంలో జరిగిన దళిత ఎంపవర్మెంట్ కార్యాచరణ ఏమైందని ప్రశ్నించాడు. ఆనాడు కూడా ఈ సమావేశానికి కేసీఆర్ తనను రాజకీయ కక్ష లో భాగంగా పిలవలేదని , ఈ రోజు కూడా దళిత ఎంపవర్మెంట్ అంటూ సమావేశం ఏర్పాటు చేయడం ఆహ్వానించదగిందే కానీ తనను పిలవక పోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు……

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ధ్వజమెత్తారు. సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకం ఓ బూటకం అని కొట్టిపారేశారు. దళితులను మరోసారి మభ్యపెట్టేందుకే కేసీఆర్ కొత్త డ్రామా షురూ చేస్తున్నాడని ఆరోపించారు. 2003 అక్టోబరు 17న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన దళిత్ ఎంపవర్ మెంట్ కార్యాచరణలోని అంశాలను అఖిలపక్షం నేతలు గమనించాలని మంద కృష్ణ సూచించారు. ఆనాడు రాజకీయ కక్షలో భాగంగా తమను ఆహ్వానించలేదని తెలిపారు. ఇప్పుడు కూడా మాకు ఆహ్వానం అందలేదు అని వెల్లడించారు.

తెలంగాణ క్యాబినెట్, సీఎం సలహామండలిలో ఎంతమంది దళితులున్నారని మంద కృష్ణ ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు ఎక్కడికి వెళ్లాయని నిలదీశారు.

కాగా, రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ స్కీమ్ పేరిట తెలంగాణ సర్కారు ఓ కార్యాచరణ తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను చర్చించేందుకు రేపు ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీల ప్రతినిధులతో పాటు దళిత సంఘాల నేతలు కూడా హాజరవుతారు. ఈ కార్యక్రమం నేపథ్యంలోనే మంద కృష్ణ స్పందించారు. అఖిలపక్షం ఏర్పాటు మంచి నిర్ణయమేనని, కానీ తమను పిలవకపోవడంతో అసంతృప్తి కలిగిస్తోందని అన్నారు.

Related posts

తెలంగాణాలో భారత్ జోడో యాత్ర ఈనెల 24 నుంచి 13 రోజులు ..డీజీపీ అనుమతి కోరతామన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!

Drukpadam

అమ‌రీంద‌ర్ ప్ర‌ధాన స‌ల‌హాదారు ప‌ద‌వికి ప్ర‌శాంత్ కిశోర్ రాజీనామా!

Drukpadam

ధర్మాన సంచలన ప్రకటన …సీఎం జగన్ అనుమతి ఇస్తే మంత్రి పదవికి రాజీనామా.. ?

Drukpadam

Leave a Comment