అత్యంత జయప్రదంగా చెన్నై ఐజేయూ సమావేశాలు
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధుల హాజరు
జర్నలిస్టులు ఎదుర్కుంటున్న సమస్యలపై విస్తృత చర్చ
మీడియా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రత్యేక తీర్మానం
జాతీయకమిటీ అధ్యక్షలు ,సెక్రటరీ జనరల్,కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు షడ్యూల్
పాల్గొన్న సినీనటి ఏఐడీఎంకే ప్రచార కార్యదర్శి గౌతమి , డీఎంకే మాజీ ఎంపీ ఇలంగోవన్
బీజేపీ నాయకులు డాక్టర్ హండే ,వశీకరన్ ,గోపాలన్ తదితరులు …





ఈనెల 2 , 3 తేదీల్లో చెన్నైలో జరిగిన ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ ) జాతీయ కార్యవర్గ సమావేశాలు అత్యంత జయప్రదంగా జరిగాయి…డెహ్రడూన్ లో డిసెంబర్ 14 ,15 తేదీల్లో జరిగిన సమావేశాల సందర్భంగా పాండిచ్చేరి లో సమావేశాలు జరిపేందుకు అక్కడ ప్రతినిధులు ముందుకొచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల అక్కడ జరగాల్సిన సమావేశాలు చెన్నై కి మార్చటం జరిగింది …20 రోజుల షార్ట్ పీరియడ్ లో సమావేశాలు జరిపేందుకు తమిళనాడు నాయకులు ముందుకొచ్చి నిర్వహించడం అభినందించదగ్గ విషయం …సమయం తక్కువగా ఉన్నా వచ్చిన ప్రతినిధులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసి శహబాస్ అనిపించుకున్నారు … చెన్నైలోని సెంట్రల్ ,ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లకు కేవలం 1 .5 కి .మీ దూరంలోని వెపేరీలోని వైఎంసిఏ నందు అన్ని ఏర్పాట్లు చేయడం గొప్ప విషయం ..




సమావేశంలో జాతీయ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి , సెక్రటరీ జనరల్ బల్విందర్ జమ్మూ , ఐజేయూ మాజీ అధ్యక్షులు ఎస్ ఎన్ సిన్హా , దేవులపల్లి అమర్ , స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం ఏ మాజీద్, జాతీయ ఉపాధ్యక్షులు అమర్ మోహన్ ప్రసాద్ , జాతీయ కార్యదర్శులు వై .నరేందర్ రెడ్డి , డి .సోమసుందర్ , సుభాష్ ,టీయూడబ్ల్యూజే అధ్యక్షులు కె విరాహత్ అలీ , కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రసాద్ వివిధ రాష్ట్రాల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక ఆహ్వానితులు సమావేశాల్లో పాల్గొన్నారు … సమావేశాలు జయప్రదం అయ్యేందుకు ఆ రాష్ట్ర అధ్యక్షులు డి ఎస్ ఆర్ సుభాష్ , రమేష్ లు వారి టీం చేసిన కృషి చెప్పుకోదగ్గది …రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో మొదటి రోజు వివిధ రాష్ట్రాల్లో మరణించిన జర్నలిస్టులకు సమావేశం సంతాపం తెలిపి మౌనం పాటించింది … ప్రారంభంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.. సమావేశం దేశంలో జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలు చేయడమే కాకుండా వివిధ రంగాలలో పనిచేస్తున్న వారిని ఆహ్వానించి సందేశాలు ఇప్పించడం ప్రత్యేకత … దక్షణాదిలో ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందిన ప్రస్తుత ఏఐడీఎంకే ప్రచార కార్యదర్శి గౌతమి , మాజీ రాజ్యసభ సభ్యులు ఇళంగోవన్ , డాక్టర్ హండే , ఆమ్ ఆద్మీ పార్టీ తమినాడు అధ్యక్షులు వశీకరన్ మలేషియా నుంచి ప్రత్యేకంగా హాజరైన తనింద్రన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ స్టార్ రజినీకాంత్ దత్తత తండ్రి … ఏఐడీఎంకే నేత …,హిందూ ప్రత్రికా రిటైర్డ్ జర్నలిస్ట్ గోపాలన్ ఉన్నారు …వచ్చిన వారికీ దేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై , జర్నలిజం పై అవహగాహన ఉందా ..? తమిళనాడు అధ్యక్షులు సుభాష్ వారిని ఎందుకు పిలిచారు …అని సందేహాలు వచ్చాయి..అయితే సమావేశాలు ప్రారంభం నుంచి ముగింపు వరకు మాట్లాడిన అతిధులందరు దేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు , ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మీద మాట్లాడిన తీరు అద్భుతంగా ఎడ్యుకేట్ గా ఉండటం ప్రశంశించ దగ్గది …
సమావేశాలకు అధ్యక్షత వహించిన ఐజేయూ అధ్యక్షులు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి తొలుత సమావేశాల ప్రాముఖ్యతను , దేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను , ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ తీరును జర్నలిజం పై దాని ప్రభావాన్ని గురించి వివరించారు … తాము డిమాండ్ చేస్తున్న మీడియా కమిషన్ ఏర్పాటు ఆవశ్యకత నొక్కి చెప్పారు …1955 -56 లో కేంద్రం తెచ్చిన జర్నలిస్టుల చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేయడాన్ని తప్పు పట్టారు ..జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ,హత్యలను తీవ్రంగా గర్హించారు …



సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ గత సమావేశాల నుంచి నేటివరకు నిర్వహించిన కార్యకలాపాల నివేదికను ప్రవేశ పెట్టారు …వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు …ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు , తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ , కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షఫీక్ , పంజాబ్ నుంచి జండూ , హర్యానా అధ్యక్షులు రాంసింగ్ బ్రార్ ,కర్ణాటక నుంచి భాస్కర్ రెడ్డి , బీహార్ నుంచి అమర్ మోహన్ ప్రసాద్ , మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రమోద్ , లడక్ నుంచి చుంగ్ , ఒడిశా … తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె .రాంనారాయణ తదితరులు ఆయా రాష్ట్రాల నివేదికలు ప్రవేశ పెట్టారు …
ఢిల్లీలో ఐజేయూ కేంద్ర కార్యాలయం …
ఇప్పటివరకు హైద్రాబాద్ అడ్రస్ తో ఉన్న ఐజేయూ కేంద్ర కార్యాలన్నీ ఇక నుంచి దేశ రాజధాని ఢిల్లీకి మార్చుతూ సమావేశం తీర్మానించింది …ఉత్తర ప్రత్యుత్తరాలు అన్ని అక్కడ నుంచే జరుగుతాయని తెలిపింది …
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ను మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా గా మార్చాలంటూ పార్లమెంటరీ సలెక్ట్ కమిటీ సూచించడంపట్ల సమావేశం హర్షం వ్యక్తం చేసింది ..దీనిపై జాతీయ యూనియన్లతో చర్చించి అందులో జర్నలిస్ట్ యూనియన్లకు ప్రాతినిధ్యం ఇవ్వాలని సమావేశం కేంద్రప్రభుత్వాన్ని కోరింది …అదే సందర్భంలో దేశంలో జర్నలిస్టుల స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనీ సమావేశం డిమాండ్ చేసింది ..కమ్యూనికేషన్ల శాఖను , ఎలక్ట్రానిక్ మీడియా విభాగాన్ని సమాచార ప్రసారాల శాఖలో విలీనం చేయాలనే ప్రతిపాదనకు సమావేశం అభ్యంతరం వ్యక్తం చేసింది ..జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలని కోరుతూ తీర్మానం చేసింది …ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా , మీడియా అక్రిడేషన్ కమిటీల నిబంధనలను సవరించి అందులో జర్నలిస్టుల ప్రాతినిధ్యం ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది ..ఇప్పటివరకు పత్రికలకు ,మ్యాగ్జైన్లకు ఇస్తున్న పోస్టల్ రాయితీ పునరుద్దరించాలని సమావేశం కోరింది ..
జర్నలిస్టుల సమస్యలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది …
