Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లను 153కు పెంచాల్సిందే: వినోద్ కుమార్…

తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లను 153కు పెంచాల్సిందే: వినోద్ కుమార్
జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లు పెంచాలని య‌త్నం
మ‌రి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పెంచ‌రు?
రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని మోదీ అన్నారు
ఈ రాజ్యాంగ సవరణ అంశం జమ్మూకశ్మీర్‌కు వర్తించదా?

నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి చర్చకు వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు… ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు…. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం జరిగిన ఉద్యమం తెలిసిందే … ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు విభజన చట్టంలో అనేక హామీలు ఇచ్చింది . అందులో రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశం ఉంది … దీనిపై ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి నరేంద్రమోడీ కి విజ్ఞప్తి చేస్తే ఇప్పుడు కుదరదు … రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ జరగాల్సిందే అన్నారు …

కానీ ఇటీవల జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచేందుకు సహకరించాలని ఆరాష్ట్ర అఖిల పక్ష నేతలతో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ స్వయంగా వివిధ పార్టీల నేతలను కోరారు …. జమ్మూ అండ్ కశ్మీర్ కు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచేందుకు ఎలాంటి అభ్యంతరంలేదు . కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిలు కోరినప్పుడు ఎందుకు పెంచలేదు …. జమ్మూ కశ్మీర్ కు రాజ్యాంగ సవరణ అవసరం లేదా ? అని టీఆర్ యస్ కు చెందిన మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రశ్నించారు.

నిజమే కదా ? 2014 లో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ లో 119 గా ఉన్న అసెంబ్లీ సీట్లు 153 కు , ఆంధ్రప్రదేశ్ లో 175 ఉన్న సీట్లను 225 కు పెంచేందుకు విభజన చట్టంలోనే ఉంది … కానీ ఇంతవరకు దీనిపై పురోగతి లేదు …. పెంచమని రెండు రాష్ట్రాలు కోరుతున్న పట్టించుకోవడం లేదు పైగా జమ్మూ కశ్మీర్ కు పెంచేందుకు లేని అడ్డంకి తెలుగు రాష్ట్రాలకు ఎందుకో అనే ప్రశ్న సహజంగానే వస్తుంది…. ఒకే దేశం ఒకే రాజ్యాంగం అంటున్న ప్రధాని మోడీ ఎలాంటి చర్యలు తీసుకొంటారు అనేది ఆశక్తిగా మారింది….

తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బి.వినోద్ కుమార్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లు పెంచాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ప్రయత్నిస్తోంద‌ని, అక్క‌డ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింద‌ని గుర్తు చేశారు.

మ‌రి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఎందుకు కుద‌ర‌ద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ విష‌యంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరితే 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని చెప్పార‌ని అన్నారు. అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ అన్నార‌ని, మరి ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ అంశం జమ్మూకశ్మీర్‌కు వర్తించదా? అని నిల‌దీశారు. మోదీ స‌ర్కారు చెబుతోన్న‌ ఒకే దేశం, ఒకే చట్టం అంటే ఇదేనా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. వినోద్ కుమార్ లాజిక్ పై కేంద్రం ఎలా స్పందిస్తుందో …..

Related posts

షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు..

Drukpadam

కోమటిరెడ్డి హంగ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు…గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్!

Drukpadam

‘ఇండియా’ అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి: రాజ్యసభలో బీజేపీ ఎంపీ బన్సాల్ వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment