Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

న్యూస్ ఇన్ బ్రీఫ్ …………..

తెలంగాణలో జాబ్ క్యాలండర్ ని వెంటనే విడుదల చేయాలి :డివై ఎఫ్ ఐ

డివై ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి అయితగోని విజయ్ కుమార్ డిమాండ్.

-డివై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ప్ల కార్డ్స్ తో ఖమ్మంలో నిరసన ప్రదర్శన.

ఖమ్మం: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకోసం ప్రభుత్వం వెంటనే అన్ని శాఖల ఖాళీలనీటితో కలిపి జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలని డివై ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి అయితగోని. విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణలో నిరుద్యోగులకు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిని వెంటనే భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డివై ఎఫ్ ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక యన్. యస్. పి క్యాంప్ సుందరయ్య భవన్ నుండి సరితా క్లినిక్ వరకు నిరుద్యోగులు నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఆంధ్ర ప్రభుత్వం నిన్న మొన్న వచ్చి జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. అది తక్కువే అయ్యుండొచ్చు. ఇంకా అక్కడ ఎక్కువ పోస్టులు చేర్చాలి. కానీ జాబ్ క్యాలండర్ వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు  లక్షా 7వేల ఉద్యోగాలు 2 సంవత్సరాలలో భర్తీ చేస్తానని చేయలేదు. గతంలో ఎం ఎల్ సి ఎన్నికలప్పుడు 50వేలకు నోటిఫికేషన్లు ఇస్తానని బాకా ఊదారు. దానికి కూడా భర్తీ ప్రక్రియ మొదలెట్టలేదు.

 తెలంగాణ రాష్ట్రంలో 1,91,126 ఖాళీలు ఉన్నట్లు పి ఆర్ సి నివేదిక వెలిబుచ్చింది. ఈ ఖాళీలన్నింటికి నోటిఫికేషన్లు ఇచ్చేలా ఇయర్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి. అలాగే ఇతర డిపార్ట్మెంట్ లలో దాదాపు లక్ష ఖాళీలు ఉన్నాయి.వాటిపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే కరోనా కారణంగా ప్రజల బతుకులు చితికి పోయాయి. ఉద్యోగాలు ఊడిపోయ్యాయి.7 ఏండ్లుగా ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న నిరుద్యోగుల పరిస్థితి డబ్బులు కూడా లక్షలు ఇప్పటికే ఖర్చు పెట్టుకొని  ‘ ఒంటె నాలుక కోసం నక్క ఆశపడ్డట్టు ఉంది.గ్రూప్ 1 ,3,4 అలాగే JL, DL ,యూనివర్సిటీ ఖాలీలు భర్తీకి 7 ఏళ్లుగా నోటిఫికేషన్ లు రాలేదు, నోటిఫికేషన్లు వస్తే ప్రిపేర్ అయ్యే వారి టైం వృధా కాదు. రాని వారు వేరే ఉద్యోగాలను వెతుక్కొనే అవకాశం ఉంటుంది అని అన్నారు.కావునా వెంటనే ఇయర్  జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

*-ఈ సందర్భంగా డి. వై. యఫ్. ఐ జిల్లా కార్యదర్శి షేక్. బసీరుద్దీన్ మాట్లాడుతూ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతిపై కూడా ఇంతవరకు దాని విధివిధానాలను ప్రకటించకుండా అమలు చేయడం లేదు. నిరుద్యోగులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డి. వై. యఫ్
ఐ జిల్లా అధ్యక్షుడు మధాల.ప్రభాకర్,జిల్లా సహాయ కార్యదర్శి చింతల. రమేష్, యంగ్ ఉమెన్ జిల్లా కన్వీనర్ పొల్లెపల్లి. శరణ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సత్తెనపల్లి. నరేష్,ఇoట్లురి.అశోక్, రాజు,జిల్లా నాయకులు నాగరాజు, శ్రీను,మధులత, మురళి.జక్కంపూడి. కృష్ణ, అరవింద్, సాయి,పుష్ప రాజు తదితరులు పాల్గొన్నారు.

నిరాశ్రయులను పరామర్శించిన నాయకులు.

ప్రత్యామ్నాయం చూపకుండా అర్ధాంతరంగా ఇళ్ల కూల్చి వేత తగదు.
-పోలీసులను మోహరించి భయ బ్రాంతులకు గురి చేయడం మంచిది కాదు.

ఖమ్మం : స్థానిక మమత ఆసుపత్రి రోడ్డులో గల రామచంద్రయ్య నగర్ ప్రాంతంలో పోలీసులు , అధికారులు కలిసి పేదల ఇళ్లను కూల్చివేయడంతో నిరాశ్రయులైన వారిని శనివారం తెలంగాణ జన వేదిక , తెలంగాణ ఉద్యమకారుల ఫోరం , లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు పరామర్శించారు .తమ ఇళ్లను కూల్చివేత కారణంగా నిరాశ్రయులైన పేదలకు ఈ సందర్భంగా ధైర్యం చెప్పారు . ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధంతరంగా పేదల ఇళ్లను కూల్చి వారిని నిరాశలు చేయడం మంచి పద్ధతి కాదని పలికారు . అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడం కూడా సమంజసం కాదని తెలిపారు . ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఉన్నచోటునుంచి వారిని తరలించడం మానవత్వం అనిపించు కోదు అన్నారు .నిరాశ్రయులైన పేదలకు అక్కడే పట్టాలు ఇచ్చి , వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించాలని డిమాండ్ చేశారు . అనేక కోర్టులలో ఈ కేసు నడుస్తుండగా పోలీసులు , అధికారులు అప్రజాస్వామికంగా పేదల ఇళ్లను ఎలా కూల్చారు అని ప్రశ్నించారు . దీనిపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ జన వేదిక జిల్లా అధ్యక్షులు కోయిన్నీవెంకన్న , తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ , ఉపేంద్ర , తీగల రాము , అఖిల్ , శ్రీనివాస్ , సురేష్ , రామకృష్ణ , రవీందర్ , సతీష్ , నీల , నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

హర్వెస్టు స్కూల్ దగ్గర గుడిసె నివాస పేదలకు న్యాయం చేయాలి

అర్బన్ తహశీల్దార్ కి వినతి

న్యాయం జరిగే వరకు పోరాడుతాం

సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్
………………………………
ఖమ్మం:- ఖమ్మం ఖానాపురం హవేలీ పరిధిలోని హర్వెస్టు స్కూల్ పక్కన తోలగిస్తున్న పేదల గుడిసె లను సిపిఎం జిల్లా నాయకత్వం పరిశీలించి వారిని పరామర్శించటం జరిగింది.
ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కి జిల్లా నాయకత్వం వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ పేదలకి ప్రతి ఒక్కరికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పి ఏడేళ్లు అవుతున్నా నేటికి ఈ హమీ ని నెరవెర్చలేదని, సంవత్సరాలు తరబడి నివాసముంటున్న ఈ అర్హులైన పేదలందరికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు సిపిఎం అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటి సభ్యులు యర్రా శ్రీ నివాసరావు, వై.విక్రమ్, తుశాకుల లింగయ్య, నందిపాటి మనోహర్, యస్ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

అక్రమ ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలి
వైరా ఎమ్యెల్యే లావుడ్యా రాములు నాయక్

వైరా ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయం నందు మండల, టౌన్ పార్టీ అధ్యక్ష్యుల అధ్యక్ష్యతన నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్యెల్యే రాములు ముఖ్య అతిదిగా పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని కృష్ణా నదిపై AP ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం RDS వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని లక్షలాది ఎకరాలకు సాగు త్రాగునీరుకు ఇబ్బంది కలగడంతో పాటు ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, వై,రా సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలలో వేలాది ఎకరాలకు సాగు త్రాగు నీటికి తీవ్ర ఇబ్బంది కలుగుతుందని దీనివలన నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని పంట పొలాలు బీడుగా మారే ప్రమాదం ఉందని అన్నారు.
గత రెండు సంవత్సరాలుగా వర్షాలు సమృద్ధిగా కురవడంతో NSP-2 జోన్ పరిధిలోని వైరా నియోజకవర్గంలోని కొనిజర్ల వైరా ఏన్కూరు మండలాల్లో భూములకు సాగునీరు అందింది కానీ ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టు వల్ల దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని దీనిపై తెలంగాణ రైతాంగం వ్యతిరేకించాలన్నారు గతంలో నాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద అక్రమంగా ప్రాజెక్టు నిర్మించడం వల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలోని తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారి౦దని.
ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రైతులంతా అండగా నిలవాలని ఎమ్మెల్యే రాము నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్,మున్సిపల్ చైర్మన్ సుతగాని జైపాల్,వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు,వైరా మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి మోహన్ రావు,కొణిజేర్ల మండల పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు, టౌన్ పార్టీ అధ్యక్షుడు దార్న రాజశేఖర్, ఏన్కూర్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సురేష్ నాయక్,జిల్లా నాయకులు మచ్చ బుజ్జి,డాక్టర్ కాపా మురళి కృష్ణ, పోట్లపల్లి శేషగిరిరావు, రాయల పుల్లయ్య, ఏన్కూర్ రైతుబంధు మండల కన్వీనర్ మేడ ధర్మారావు,పెద్దమునగాల సర్పంచ్ పరికపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం రూరల్ మండలం లో వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్సీ మధు ,ఎమ్మెల్యే కందాల

Ram Narayana

గోల్డెన్ సూట్ కేసుతో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన నాగచైతన్య… ఎలిమినేట్ అయింది ఎవరంటే…!

Drukpadam

మద్యంలో సైనైడ్ కలిపి ముగ్గురిని హత్యచేసిన స్థానిక డాక్టర్

Drukpadam

Leave a Comment