Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జులై 7న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకారం…

జులై 7న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకారం
-అందరిని కలుపుకొని పోతానంటున్న రేవంత్ రెడ్డి
-రాహుల్ ,సోనియా నమ్మకాన్ని వమ్ము చేయను
-రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాల్సి ఉంది.
-రాష్ట్రంలో ,కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.
-పార్టీ అనుమతి తో పాదయాత్ర … సమిష్టి నిర్ణయంతోనే ముందుకు
-కేసీఆర్ అందరిని విడదీసి అధికారం పదిలం చేసుకుంటున్నారు
-కేసీఆర్ ఉచ్చులో పడవద్దు …

జులై 7న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానని నూతన టీపీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేసిన రేవంత్‌రెడ్డి అన్నారు.  మధ్యాహ్నం 1.30 గంటలకు అధికారికంగా పార్టీ అధ్యక్ష భాద్యతలు చేపడతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు . పార్టీలో అసమ్మతిపై ఆయన స్పందిస్తూ ఇలాంటివి సహజమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలాంటివి ఎప్పుడు ఉంటాయని అందువల్ల పెద్దలను సీనియర్లను సంప్రదింస్తానని , సీనియర్లను కలుస్తానని వారి సహాయసహకారాలు తీసుకుంటాననని తెలిపారు . పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలుండవు అని అన్నారు. ఉమ్మడిగానే నిర్ణయాలు తీసుకుంటాం అని పేర్కొన్నారు . పార్టీ నిర్ణయం మేరకే అందరం కలిసి కట్టుగా ముందుకెళ్తాం అని అన్నారు .తెలంగాణలో ప్రజా పునరేకీకరణ జరగాల్సి ఉంది అందుకు తన శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు . కేసీఆర్‌ ప్రజలను విడదీసి అధికారం పదిలం చేసుకుంటున్న విషయాన్నీ గుర్తించాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి దేశానికి చేసిన సేవలు అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలన్నారు.టీలంగా ఇచ్చింది కాంగ్రెస్ కాగా అనుభవిస్తుంది వేరేవాళ్ళ అని అన్నారు. ఇచ్చిన సోనియాగాంధీకి రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారని కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియా ఋణం తీర్చుకోవాలని అన్నారు.

కేంద్రంలో మోడీ పాలనపై , రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజలు రగిలి పోతున్నారని రానున్న కాలం కాంగ్రెస్ దేనని రాష్ట్రంలోనూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పార్టీ అనుమతితో రాష్ట్రంలో పాదయాత్ర చేపడతానని అందుకు హైకమాండ్ నాయకుల వద్ద మాట్లాడిన తరువాత వివరాలు వెల్లడిస్తానని అన్నారు.

సీనియర్లను అందరిని కలుపుకునే పోయేందుకు చేస్తున్న కృషిని రేవంత్ పదవి వచ్చిన వెంటనే మొదలు పెట్టారు . మొదటి ఆయన సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిని కలిశారు.అనంతరం అయన షబ్బీర్ అలీ , మల్లు భట్టి విక్రమార్క ఇళ్లకు వెళ్లారు . నిన్నమొన్నటి వరకు అసమ్మతి రాగాలు బలంగా వినిపించిన జగ్గారెడ్డి కొంత మెత్తబడ్డారు. పార్టీ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాలిసిందేనని అన్నారు. కోమటి రెడ్డి మాటలపై ఆయన స్పందిస్తూ , కోమటి రెడ్డి స్థానంలో ఉన్న ఎవరైనా అంటే మాట్లాడతారని అన్నారు. షబ్బీర్ అలీ , మల్లు రవి రేవంత్ నియామకంపై హర్షం ప్రకటించారు.

Related posts

చంద్రబాబు ఎత్తుగడలు ఇక పారవు ఆయనతో బీజేపీ కలిసే ప్రసక్తేలేదు : సునీల్ దేవధర్!

Drukpadam

నాగార్జునసాగర్‌లో బీజేపీకి వరుస షాకులు!

Drukpadam

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ గురించి సంచలన విషయాలు వెల్లడించిన దేవేంద్ర ఫడ్నవీస్!

Drukpadam

Leave a Comment