Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Ponguleti Sudhaakar Reddy
ఆంధ్రప్రదేశ్

పొంగులేటి సుధాకర్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

  • ఖమ్మంలోని అంబేద్కర్ విగ్రహం శుభ్రం చేస్తుండగా క్రింద పడ్డ సుధాకర్ రెడ్డి
  • గాయాలు కాక పోవడంతో ఊపిరి పీల్చుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు

బీజీపీ జాతీయ నాయకులు, మాజీ శాసన మండలి సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆదివారం ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేశారు. విగ్రహం చుట్టూ నీళ్ళతో కడిగి చీపురుతో ఊడ్చారు. ఈ సందర్భంగా ఆయన మెట్లపై కాలు జారి క్రింద పడ్డారు. బెజేపీ కార్యకర్తలు, నాయకులు వెంటనే సుధాకర్ రెడ్డిని పైకి లేపారు. ఆ సమయంలో సుధాకర్ రెడ్డి రేలింగ్ పట్టుకొనే ఉండడంతో గాయాలు కాలేదు. దీంతో బీజేపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. తొలుత జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం రూరల్ మండలాలోని తెల్దారుపల్లి కి వచ్చిన సుధాకర్ రెడ్డికి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావుతో నేతృత్వంలో ఇతర ముఖ్య నేతలతో కలిసి ఆయన తెల్దారుపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గల అంబేద్కర్ విగ్రహాల వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఈ పర్యటనలో బెజేపీ పార్లమెంటరీ కోఆర్డినేటర్ నంబూరి రామలింగేశ్వర రావు, గోంగూర వెంకటేశ్వర్లు, సన్నె ఉదయ్ ప్రతాప్, దేవకీ వాసుదేవ రావు, ఈవీ రమేష్, నున్నా రవి కుమార్, దొంగల సత్యనారాయణ, కోటమర్తి సుదర్శన్, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, నీరుకొండ ఉషారాణి, రేఖా సత్యనారాయణ, మాడుగుల చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులకు ఓ గుడ్ న్యూస్!

Drukpadam

మీడియా ప్రతినిధులకు ప్రత్యేక పాస్ అవసరంలేదు :డీజీపీ మహేందర్ రెడ్డి…

Drukpadam

ఆనందయ్య ఇచ్చేది నాటుమందు: రాష్ట్ర ఆయుష్ కమిషనర్ కర్నల్ రాములు…

Drukpadam

Leave a Comment