Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ వైఖరిని తప్పు పట్టిన మంద కృష్ణ మాదిగ …

అఖిల పక్షాన్ని బహిష్కరించి బీజేపీ తప్పు చేసింది: మందకృష్ణ మాదిగ
అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకపోవడం ముమ్మాటికీ తప్పే
ఇప్పుడు బీజేపీ ఎన్ని చెప్పినా దళిత సమాజం గుర్తించదు
భవిష్యత్తులోనూ బీజేపీ హాజరు కాదా?

 

బీజేపీ ముఖ్యమంత్రి అఖిల పక్ష సమావేశాన్ని భావిష్కరించడం ముమ్మాటి తప్పేనని మంద కృష్ణ మాదిగ అభిప్రాయపడ్డారు. బీజేపీ భవిష్యత్ లో కూడా ఇదే వైఖరితో ఉంటుందా ? అని ప్రశ్నించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి లేఖ రాశారు.

దళిత ఎంపరర్ మెంట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్ లో అఖలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి అన్ని పార్టీలని ఆహ్వానించారు. బీజేపీ ఈ సమావేశాలని భావిష్కరిస్తున్నట్లు ప్రకటించింది . దీనిపై మాదిగ దండోరా వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ స్పందించారు. బీజేపీ నిర్ణయం తప్పను సమావేశానికి హాజరై నివిధానం ఏమిటో వివరించే అవకాశం కోల్పోయారని పేర్కొన్నారు. దళితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి పోకుండా దళితుల గురించి ఏమి మాట్లాడినా ప్రయోజనం ఉండదని అన్నారు.

తనను సమావేశానికి పిలవక పోవడంపై మంద కృష్ణ మాదిగ అసంతృప్తి వ్యక్తం చేశారు.నిత్యం దళితులకు , బహుజనములకోసం కొట్లాడుతున్న వారిని సమావేశానికి కేసీఆర్ ఆహ్వానించాల్సి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి గతంలో లాగా దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించాలని కోరారు …

దళితుల సాధికారతకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించడం ముమ్మాటికీ తప్పేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు లేఖ రాశారు. రాజకీయ పక్షాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇది దళితులకు సంబంధించిన అంశం కాబట్టి దాని గురించి మాట్లాడడానికి, ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టడానికి సమావేశానికి హాజరు కావడం బీజేపీ బాధ్యత అని మందకృష్ణ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇప్పుడు బీజేపీ ఎన్ని కారణాలు చెప్పినా దళిత సమాజం వాటిని గుర్తించదని అన్నారు. అఖిపక్ష సమావేశానికి వెళ్లకూడదన్న బీజేపీ నిర్ణయం ఒక్క దానికే పరిమితమా? లేక భవిష్యత్తులో జరిగే అఖిలపక్ష సమావేశాలకూ ఇది వర్తిస్తుందా? అన్న విషయాన్ని బీజేపీ స్పష్టం చేయాలని మంద కృష్ణ మాదిగ ఆ లేఖలో డిమాండ్ చేశారు.

Related posts

కుప్పం ప్రజలకు చంద్రబాబు భరోసా… 1 కోటి వ్యయంతో పలు కార్యక్రమాలు!

Drukpadam

చెన్నై కి నీరు సరఫరా విషయంలో ఏపీ తెలంగాణ మధ్య వివాదం…..

Drukpadam

కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి సీదిరి అప్పల్రాజు!

Drukpadam

Leave a Comment