Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గిల్లుడు భేరం అంటే ఇదేనేమో … టీపీసీసీ పీఠం పై విజయసాయి వ్యాఖ్యలు…

గిల్లుడు భేరం అంటే ఇదేనేమో … టీపీసీసీ పీఠం పై విజయసాయి వ్యాఖ్యలు
చంద్రబాబు కాంగ్రెస్ పెద్దల్ని కొనిపడేసి తెలంగాణాలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నాడు
పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు
గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ ను భ్రష్టు పట్టించారు
ఇప్పుడు కాంగ్రెస్ ను డైరెక్ట్ గా కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితుడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్ అని అన్నారు. పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు.

దీంతో గిల్లుడు భేరం అంటే ఇదేనేమో అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి …. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు గా నియమితులయ్యారు …. దీనికి వైసీపీ సంభందం లేని విషయం కదా ?రేవంత్ రెడ్డి పదవి ఎలాతెచుకున్నది కూడా వైసీపీకి అనవసరం … కానీ వైసీపీ ప్రధానకార్యదర్శి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబు ను తిట్టదలుచుకుంటే అనేకం ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి నియామకంపై కామెంట్ చేయడం నిజంగా విడ్డురమే …. గిల్లుడు భేరం అంటే ఏందో అనుకున్నాం … కానీ విజయసాయి మాటలు విన్న తరువాత గిల్లుడు భేరం అంటే ఇదేనేమో అనేలా ఉంది . అసలే రోజు సమస్యలతో సతమతం అవుతున్న జగన్ కు ఇలాంటి వ్యాఖ్యలు కొత్త సమస్యలు తెస్తాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కొనిపడేసి, తన శిష్యుడు రేవంత్ కు అధ్యక్ష పీఠాన్ని ఇప్పించుకున్నాడని కోమటిరెడ్డి ఆరోపణలనే విజయసాయి చేశారు . కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టు పట్టించాడని దుయ్యబట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ను డైరెక్ట్ గా తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నాడని మరో బాంబు పేల్చాడు .

కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు చంద్రబాబు బీజేపీ తీర్థం ఇప్పించారని విజయసాయి విమర్శించారు. ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించారని ఆరోపించారు. పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్ లోకి తోలారని అన్నారు. ‘బాబా మజాకా!’ అంటూ ఎద్దేవా చేశారు.

Related posts

మున్నూరు కాపుల్లో తీవ్ర అసంతృప్తి …ఖమ్మం లో అన్ని కమ్మలకేనా!

Drukpadam

ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలోకి ఈటలపై గంగుల ఫైర్!

Drukpadam

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రచారం?

Drukpadam

Leave a Comment