Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మాటనిలబెట్టుకున్న కేసీఆర్ …మరియమ్మ కుటుంబానికి సహాయం అందజేత …

మరియమ్మ కుటుంబానినికి అండగా కేసీఆర్ …మాట ప్రకారం ఉద్యోగం ఎక్సిగ్రేషయో
-కోమట్లగూడెంలో అందజేసిన మంత్రి ,ఎంపీ సీఎల్పీ నేత భట్టి
-లాకప్ డెత్ మృతురాలు మరియమ్మ కుటుంబాన్ని ఆదుకున్న తెలంగాణ సర్కారు
-ఇటీవల లాకప్ లో మరణించిన మరియమ్మ
-రాజకీయ దుమారం రేపిన ఘటన
-మరియమ్మ కుటుంబ సభ్యులకు సాయం అందజేత

 

ఇటీవల మరియమ్మ అనే దళిత మహిళ అడ్డగూడూరులో లాకప్ డెత్ కు గురవడం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరియమ్మ కుటుంబాన్ని ఆదుకుంది. మరియమ్మ లాకప్ డెత్ పై సీఎల్పీ నేత నియోజవర్గ శాసనసభ్యుడిగా ఉన్న భట్టి విక్రమార్క మల్లు తొలుత స్పందించారు. కుటుంమానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని మాట ఇచ్చారు. దీనిపై రాష్ట్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి చివరకు గవర్నర్ , ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు విషయం తీసుకోని పోవడంలో భట్టి సెక్సెస్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించారు. మరియమ్మ కుటుంబాన్ని అన్ని రకాల ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేసీఆర్ , అప్పుడే సీఎల్పీ నేతలకు మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు , కుటుంబసభ్యులకు 35 లక్షల రూపాయల ఎక్సిగ్రేషయో ప్రకటించారు. ఈ మొత్తాన్ని జిల్లా మంత్రి అజయ్, ఎంపీ నామ, సీఎల్పీ నేత భట్టి కలిసి మరియమ్మ గ్రామానికి వెళ్లి అందజేయాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి ఖమ్మం జిల్లాలోని కోమట్లగూడెం గ్రామంలో పర్యటించారు. మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం ఆర్డర్తో పాటు రూ.15 లక్షలు అందజేశారు. మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో రూ.10 లక్షలు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, మరియమ్మ మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్ణన్ , జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

రెండు రోజుల ముందు రాష్ట్ర డీజీపీ స్వయంగా వచ్చి ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ ను పరామర్శించాడు. మరియమ్మ మరణం దురదృష్ట కరమని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు , సిబ్బంది వ్యవహరించాలని అన్నారు .

భట్టికి జై కొట్టిన కోమట్లగూడెం ప్రజలు …..

చింతకాని మండలం కోమట్లగూడెం దళిత మహిళ మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం నుండి సహాయం అందించడంలో విశేష కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే , సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కు కోమట్లగూడెం ప్రజలు జైకొట్టారు …. మంత్రి అజయ్ , ఎంపీ నామ , కలెక్టర్ కర్ణన్ తో కలిసి గ్రామానికి వచ్చిన భట్టికి జైకొట్టడం టీఆర్ యస్ నాయకులను కొంత ఇబ్బందికి గురిచేసింది .
భట్టి లేకుంటే మాకు న్యాయం జరిగేది కాదని మరియమ్మ కుటుంబ సభ్యులు అనడం గమనార్హం .మంత్రి,ఎంపీ,కలెక్టర్ సమక్షంలో ఇద్దరు ఆడ పిల్లలకు ఒకొక్కరికి 10లక్షలు,కుమారుడు ఉదయ్ కిరణ్ కు 15 లక్షలు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని భట్టి చేతులమీదుగా కుటుంబసభ్యులకు అందించారు…. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ….
రాష్ట్రంలో ఏ పేదవారికి ఆపద వచ్చినా అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాడుతా అని అన్నారు .

Related posts

పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలని ఏపీలో కలెక్టరేట్ల వద్ద టీచర్ల భారీ ఆందోళన..

Drukpadam

కుండపోత వానకు నీట మునిగిన చెన్నై… నగరంలో రెడ్ అలర్ట్!

Drukpadam

అమెరికాలో భారతీయులపై వివక్ష: తేల్చిన సర్వే….

Drukpadam

Leave a Comment