Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రజలు కరోనా మార్గదర్శకాలు పాటించడంలేదన్న ఎయిమ్స్ చీఫ్ గులేరియా

ప్రజలు కరోనా మార్గదర్శకాలు పాటించడంలేదన్న ఎయిమ్స్ చీఫ్ గులేరియా
భారత్ లో నిత్యం లక్షల్లో కరోనా కేసులు
గత 24 గంటల్లో 2.34 లక్షల పాజిటివ్ కేసులు
వెయ్యికి పైగా మరణాలు వైరస్ రూపాంతరం చెందుతోందని వెల్లడి
భారత్ లో గడచిన 24 గంటల్లో 2.34 లక్షల కరోనా పాజిటివ్ కేసులు రావడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. గత కొన్నిరోజులుగా కేసుల ఉద్ధృతి క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీనిపై ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. కేంద్రం జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాలను ప్రజలు పాటించకపోవడం, రూపు మార్చుకున్న వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం దేశంలో కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలని వెల్లడించారు.

వ్యాక్సినేషన్ జరుగుతోందన్న ధీమాతో ప్రజలు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారని వివరించారు. కరోనా విస్తరిస్తుంటే దేశంలో మత సంబంధ కార్యక్రమాలు, ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎన్నికలు, మత కార్యక్రమాలను ఆంక్షలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ వయోపరిమితిని సడలిస్తూ వెళ్లాలని, తద్వారా అత్యధికులకు వ్యాక్సిన్ అందించేందుకు వీలవుతుందని తెలిపారు. ఉత్తరాఖండ్ లో ముగిసిన కుంభమేళాకు నిత్యం లక్షల మంది విచ్చేసిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాప్తికి కుంభమేళా కారణమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.పశ్చిమ బెంగాల్ తో సహా అనేక రాష్ట్రాలలో స్థానిక ఎన్నికలలకు రాష్ట్రాలు ముందుకు వెళుతున్నాయని ఇప్పుడున్న ప్రరిస్థిలలో ఎన్నికలలు పెట్టడం సరైంది కాదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.బెంగాల్ లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.ఇప్పటికే ఐదు దశలు ఎన్నికలు జరగగా ఇంకా మూడు దశలు ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల షడ్యూల్ విడుదల చేసినప్పుడే తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు.కాని ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. కరోనా దేశంలో ప్రత్యేకించి ఎన్నికలు జరుగుతున్నారు రాష్ట్రాలలో ఎక్కువగా ఉందని ఒక నివేదిక వెల్లడించింది.ఇంతకు ముందు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కరోనా ప్రభావం పల్లెలలకు సైతం వ్యాపించింది .ఇటీవల ఎన్నికలలు జరిగిన రాష్ట్రాలలో వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో కూడా వైరస్ విజృంభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణాలలో ఇటీవల ఎన్నికలు జరిగాయి.ఇప్పుడు ఖమ్మం ,వరంగల్ ,సిద్ధిపేట ,అచ్చం పేట , నకిరేకల్ , తదితర మున్సిపాలిటీ , కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీని ప్రభావం వల్ల వైరస్ వ్యాప్తి చెందే ఆవకాశం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఆలోచన చేసి సరైన నిర్ణనం తీసుకోవాలని సలహాలు వస్తున్నాయి.

Related posts

భట్టి ,తుమ్మల ,పొంగులేటి ,నామ ,వద్దిరాజు ల నూతన సంవత్సర శుభాకాంక్షలు …

Ram Narayana

పాకిస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్‌కు 15 ఏళ్ల జైలు

Drukpadam

“ఇక చీపురుకట్టలపై ఎగురుతూ వెళతారు”…రష్యా వ్యంగ్యం

Drukpadam

Leave a Comment