Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నేను సోనియా మనిషిని … ఆమె నమ్మకాన్ని నిలబెడతా : రేవంత్‌రెడ్డి!

నేను సోనియా మనిషిని … ఆమె నమ్మకాన్ని నిలబెడతా  : రేవంత్‌రెడ్డి! 
-కొద్దీ కాలంలోనే తనను గుర్తించి కీలక పదవి ఇచ్చింది
-సోనియమ్మకు కృతజ్ఞత లేఖ రాయాలని టీపీసీసీ కార్యవర్గం నిర్ణయం
-ఎలాంటి భేషిజాలు లేకుండా అందరిని కలుపుకొని పోతా
రాయాలని టీపీసీసీ కొత్త కార్యవర్గం నిర్ణయం
మల్లు రవి ఇంట్లో నూతన కార్యవర్గం సమావేశం
రెండు గంటలపాటు వివిధ అంశాలపై చర్చ
అధిష్ఠానం తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామన్న నేతలు

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞత లేఖ రాయాలని తెలంగాణ కాంగ్రెస్ నూతన కార్యవర్గం నిర్ణయించింది. పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డితోపాటు కార్యనిర్వాహక అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులు, కమిటీ చైర్మన్లు నిన్న మాజీ ఎంపీ మల్లు రవి నివాసంలో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలను చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్‌వైభవం తెస్తామని, అధిష్ఠానం తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రకటించింది.

సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిస్తూ పీసీసీ కమిటీని ఏర్పాటు చేసిన అధిష్ఠానానికి నేతలు ధన్యవాదాలు తెలిపారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను సోనియాగాంధీ మనిషినని, కొత్త కమిటీపై ఆమె పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడదామని చెప్పినట్టు సమాచారం. తక్కువ సమయంలోనే అధిష్ఠానం తనను గుర్తించి కీలక పదవుల్ని ఇచ్చిందని, ఎలాంటి భేషజాలు లేకుండా అందరినీ కలుపుకుపోతానని పేర్కొన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైయ్యారని ,ప్రజలకు వాగ్దానాలు ఇస్తూ వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ,కేసీఆర్ అవినీ అక్రమాలు , ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నట్లు సమాచారం . కాంగ్రెస్ పార్టీ ,సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ ఇచ్చిన అవకాశాలను , వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2023 ఎన్నికలే టార్గెట్ గా పని చేయాలనీ సమావేశంలో నిర్ణయించారు. ఇది అధికారిక సమావేశం కానప్పటికీ కార్యవర్గంలో మెజార్టీ సభ్యులు హాజరైయ్యారు. సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి, సురేశ్ షెట్కార్, వేం నరేందర్‌రెడ్డి, జి. నిరంజన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సీట్ల కోసం కసరత్తు ?

Drukpadam

కాంగ్రెస్ పార్టీ తీరువల్లే శరద్ పవార్ ప్రధాని కాలేకపోయారు: ప్రధాని మోదీ

Ram Narayana

హైద్రాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి టీఆర్ యస్ కు షాక్ …..

Drukpadam

Leave a Comment