Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

న్యూస్ ఇన్ బ్రీఫ్ …….

పొడు సమస్యపై జైల్ భరోకి సిద్ధం

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సీతక్క,

కొత్తగూడ: పోరాటాలతోనే పోడు సమస్యకు పరిష్కారం లభిస్తుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. కొత్తగూడ మండలకేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏజెన్సీలోని పోడు భూముల సమస్య పరిష్కారం కోసం జైల్‌భరోకు కూడా వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీశాఖ పెత్తనమెంటో అర్థం కావడం లేదన్నారు.

అనంతరం పాత పోడులకు పట్టాలు జారీ చేయాలని కొత్తగూడ ఎఫ్‌ఆర్‌వో రవికిరణ్‌, తహసీల్దార్‌ నరేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో సీఐలు రాజిరెడ్డి, రవికుమార్‌, ఎస్‌ఐలు సురేశ్‌, చంద్రమోహన్‌, సతీష్‌ బందోబస్తులో పాల్గొన్నారు.

ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ను ప్రారంభం చేసిన వైరా శాసనసభ్యులు శ్రీ లావుడ్యా రాములు నాయక్ 

ది- 29/06/2021 న కొణిజర్ల మండలం లోని సింగరాయపాలెం గ్రామమునందు వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురభి వెంకటప్పయ్య  ఏర్పాటుచేసిన ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం లో వైరా శాసనసభ్యులు శ్రీ లావుడ్యా రాములు నాయక్  ప్రారంభించి అనంతరం వారు మాట్లాడుతూ మండల పరిధిలో గ్రామ రైతులు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ , వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య , మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాస రావు, మండల మండల పరిషత్ అధ్యక్షులు గోసు మధు, మండల ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, గోపవరం పిఎసిఎస్ చైర్మన్ చెరుకుమల్లి రవి, సూడ డైరెక్టర్ బండారు కృష్ణ ,ఎ.డి బాబరావు,ఏవో బాలాజీ,స్థానిక ఎస్ఐ రవి, జిల్లా నాయకులు రాయల పుల్లయ్య, పోట్లపల్లి శేషగిరిరావు, సర్పంచులు పరికపల్లి శ్రీను, రాయల నాగేశ్వరావు,వంకుడొత్ బాలాజీ,అద్దంకి చిరంజీవి,మూడ్ సురేష్, రంగు సత్యనారాయణ,ఎంపిటిసిలు బూర ప్రసాద్,వింజం విజయ,ముర్కుపుడి అంబెడ్కర్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు రాయల పుల్లయ్య, పొట్లపల్లి శేషగిరి రావు, మండల నాయకులు కొనకంచి మోషే, రచ్చ రామకోటయ్య, వింజం పిచ్చయ్య, కనగంటీ రావు,పోట్లపల్లి జిడెయ్య, లకవత్ దేవేందర్, తేజవత్ మదన్,రాయల నరసింహారావు, శీలం వెంకటరామిరెడ్డి,వడిత్య రంగా, భారత్ తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం లో  డ్రైడే ఫ్రైడే
పాల్గొన్న గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్…

ఖమ్మం కార్పోరేషన్ పరిధి 22వ డివిజన్ లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఆదేశానుసారం స్థానిక కార్పొరేటర్ పల్లా రోజులీనా  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా పోలీసు స్టేషన్ సిఐ సర్వయ్య , జిల్లా గ్రంథాలయ చైర్మన్ యo.డి ఖమర్ పాల్గొని బి.సి. హాస్టల్ ప్రాంతంలో పండ్ల , పూల మొక్కలను నాటారు . అనంతరం డివిజన్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తడి చెత్త , పొడి చెత్త గురించి వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపధ్యంలో పరిశుభ్రత , సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు . ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు పోలిస్ వెంకన్న , మైనారిటీ ఎం.బి.సి నాయుకురాలు షేక్. షకీనా, తెరాస మహిళా నగర కమిటీ ఝాన్సీ , స్వరూప , పాల్వంచ విజయ , చారి , బేడబుడిగ జంగాల నాయుకులు అల్లం దుర్గా రావు , మంజ్జు , కోటయ్య రాజు , టెంట్ హౌస్సు శ్రీను , మెండే శ్రీను , యాదగిరి , జావిద్ , ప్రవీణ్ , లావణ్య , పుష్ప తదితరులు పాల్గొన్నారు . డివిజన్ లో అంగన్ వాడి టీచర్లు , ఆర్.పిలు , శ్యానిటేషన్ సిబ్బంది , ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు .

ఖమ్మం జిల్లా లో మేగా జాబ్ మేళ నిర్వహించాలి

డివై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్…

మేగా జాబ్ మేళ నిర్వహించిఖమ్మం జిల్లా లో ఉన్న నిరుద్యోగులందరికి ఉద్యోగం కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ డిమాండ్ చేశారు.
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య సమాఖ్య ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ఉపాదికల్పన అదికారి కోండపల్లి శ్రీరామ్ గారిని కలసి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ జిల్లా లో జాబ్ మేళ ను నిర్వహిస్తామని,వినతిపత్రం లో మిగిలిన డిమాండ్స్ ను పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తిసుకెళ్తున్నన్నారు.
ఈ సందర్భంగా డివై ఎఫ్ ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ జిల్లాలోమేగా జాబ్ మేళ నిర్వహించి ఖమ్మం జిల్లాలో ఉన్న అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగం, ఉపాది అవకాశాలు కల్పించాలని,ఎంప్లాయిమెంట్ ఆఫీసులో నమోదు చేసుకున్న నిరుద్యోగ యువత బాధలు, నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తూన్న విధానం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని, జిల్లాలో ఖాళీ గా ఉన్న పోస్ట్ లు ఎఏ డిపార్ట్మెంట్ లో ఉన్నాయో నిరుద్యోగులకు తెలిసెవిదంగా డిస్ప్లే చేయాలని,తెలంగాణా లో ఇయర్ క్యాలెండర్ ప్రకటించాలని తదితర డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం అందజేయడం జరిగిందని ఆయన తెలియజేశారు.ఈ డిమాండ్స్ పరిష్కారం కాకపోతే సంఘం ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళనలుచేయనున్నట్లు ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో డివైఎఫ్ ఐ జిల్లా నాయకులు కూరపాటి శ్రీను,రావులపాటి నాగరాజు,పదముత్తుం మంగయ్య, నరేష్,పడిగెల నాగేశ్వరరావు, యర్రా నాగుల సైదారావు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

ఉత్తమ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఖమ్మం జీఆర్పీ సీఐ ఇంద్రసేనా రెడ్డి 

ఇంద్రసేనా రెడ్డి కూసుమంచి పోలీస్ స్టేషన్లో పని చేస్తుండగా జరిగిన కేసులలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఉత్తమ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 2020 సంవత్సరంనకు గాను సెలెక్ట్ అయినారు..

అందుకుగాను ఈరోజు గౌరవనీయులు శ్రీ డీజీపీ మహేందర్ రెడ్డి వద్ద నుండి ఉత్తమ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ప్రశంసాపత్రం ను అవార్డును డీజీపీ చేతుల మీదుగా ఈరోజు హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ నుండి అందుకున్నారు…

ఖమ్మం: దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్ ఘటనలో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది.

 

చింతకాని ఎస్‌ఐ రెడ్డబోయిన ఉమను ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు ఎటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు రోజుల క్రితం ఖమ్మం లో పర్యటించి మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌ను పరామర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి.. చింతకాని పీఏస్‌లో ఏమి జరిగిందన్న దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

డీజీపీ పర్యటన అనంతరం చింతకాని ఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో మరి కొంతమంది పోలీస్ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అడ్డగూడురు పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. మరియమ్మ లాకప్‌ డెత్‌ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. మరియమ్మ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

Related posts

ఇక‌పై బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో జ‌గ‌న్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌!

Drukpadam

జయలలిత చివరి రోజుల్లో చదివిన ప్రైవేట్ లైఫ్ ఆఫ్ మావో జెడాంగ్ పుస్తకం!

Drukpadam

మీడియా స్వేచ్ఛను అణిచే ప్రయత్నంలా ఉంది …ఏబీఎన్, టీవీ5లపై కేసులో సుప్రీం వ్యాఖ్య…

Drukpadam

Leave a Comment