కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెచ్చేందుకే పార్టీలో చేరాం: ఎమ్మెల్యే సీతక్క
-తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ;దాని ఋణం తీర్చుకోవాలి
-మెజార్టీ అభిప్రాయం మేరకే టీపీసీసీ చీఫ్ గా రేవంత్
-పార్టీ పలచన అయ్యేలా ఎవరు మాట్లాడవద్దు
-దళితుల పేరుతో కేసీఆర్ డ్రామాలు
-దళితులకు మేలు చేస్తానంటే ఎవరు అడ్డుపడ్డారు
-ఏడూ సంవత్సరాలుగా మాట్లాడకుండా ఇప్పుడు దళిత జపం చేస్తున్నారు
-దళితులకు మంచి చేస్తామంటే స్వాగతిస్తాం ;కానీ ఓట్ల కోసం డ్రామాలు వద్దు
-దళితుడైన రాజయ్య కు డిప్యూటీ సీఎం ఇచ్చి ఎందుకు తొలగించారు
-హరిజన గిరిజనులకు మంత్రివర్గంలో సరైన స్తానం ఎందుకు కల్పించడంలేదు
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకే తాము కాంగ్రెస్ పార్టీలో చేరమని కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూర్య అలియాస్ సీతక్క అన్నారు. రేవంత్ రెడ్డికి టీపీసీసీ రావడం పట్ల ఆమె హర్షం ప్రకటించారు. మెజార్టీ నేతల అభిప్రాయం మేరకే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని అన్నారు. పదవులకోసమో ,వాటిని అనుభవించేందుకు కాంగ్రెస్ పార్టీలోకి తాము రాలేదని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా వచ్చామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే తమ లక్ష్యం నెరవేరునట్లు అన్ని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకోని రావడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఋణం తీర్చుకోవాలని అన్నారు.
రేవంత్ కు పదవి రావడం పట్ల కొందరు వ్యతిరేకంగా మాట్లాడి పార్టీని పలుచన చేస్తున్నారని అభిప్రాయపడ్డారు . దీనివల్ల పార్టీకే కాకుండా వారికీ కూడా నష్టం జరుగుతుందని అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకోని మెజార్టీ నాయకుల అభిప్రాయం మేరకు ఏఐసీసీ పెద్దలలు ,సోనియా ,రాహుల్ గాంధీ సూచలమేరకే ఎంపిక చేశారని అన్నారు.
దళితుల పేరుతో కేసీఆర్ డ్రామాలు :పక్కదార్లు పడుతున్నఎస్సీ సబ్ ప్లాన్ నిధులు
.కేసీఆర్ దళితుల పేరుతో ఓట్ల డ్రామాలు ఆడుతున్నారని , ఎస్సీ ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదార్లు పడుతున్న విషయాన్నీ అనేకసార్లు తాము అడిగామని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదని విమర్శించారు. దళితుల ఎంపరర్ మెంట్ పేరుతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం మంచిదే అని ఏడేళ్లుగా ఎందుకు జాప్యం చేశారు. దళితులకు మేలు చేయమని కాంగ్రెస్ పార్టీ శాసనసభలో అనేకమార్లు డిమాండ్ చేసింది నిజంకాదా? అని ఆమె ప్రశ్నించారు. దళితులకు మేలు చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డం పడ్డట్లుగా మాట్లాడటం పై ఆమె ధ్వజమెత్తారు . ఎవరు అడ్డం పడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులను మోసం చేయద్దని ఓట్ల రాజకీయాలు చేయొద్దని ఆమె అన్నారు.
రాజయ్య మంత్రి పదవి ఎందుకు గుంజుకున్నావు ….
రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి తిరిగి ఎందుకు గుంజుకున్నారు ఇదేనా మీ దళిత ఎజెండా … ఎవరు గుంజుకోమన్నారు. మంత్రి వర్గంలో ఎంతమంది ఎస్సీ ,ఎస్టీ మంత్రులు ఉన్నారు. సామాజిక న్యాయం అమలు జరుగుతుందా ? అనే ఆమె కేసీఆర్ విధానాలపై ధ్వజమెత్తారు.
ఎస్సీ , ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కూడా పక్క దారి పట్టించారని ఆరోపించారు. ఎస్సీ ,ఎస్టీల కోసం ఖర్చు చేయాల్సిన నిధులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో గిరిజనులకు అన్యాయంజరుగుతుందని ఆరోపించారు. మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని సీతక్క పేర్కొన్నారు.