మంత్రి పువ్వాడ జోక్యంతో అధిక బిల్లు వెనక్కి చెల్లించిన ఆసుపత్రి..
-ఆసుపత్రికి భాదిత కుటంబం చెల్లించిన రూ.5లక్షలు బిల్లు వెనక్కి.
-పేదకుటుంబానికి తొలగిన అప్పుల భారం
-మంత్రి స్పందనపై అభినందలు వెల్లువ
ఖమ్మం నగరానికి చెందిన టీఆర్ యస్ పార్టీ సాధారణ కార్యకర్త షేక్ అలీం అలీ ఖురేషి. .మంత్రి పువ్వాడ అజయ్ వీరాభిమాని.కరోనా తో ఆసుపత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లి లక్షలు హెచ్చించినప్పటికీ ప్రాణాన్ని కాపాడలేక పోయారు . ప్రాణాలు నిలబెట్టలేక పోయిన ఆసుపత్రి యాజమాన్యం చనిపోయిన మృతదేహాన్ని అప్పగించాలంటే 2 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే అని డబ్బు కట్టించుకున్నారు. ఈ విషయాలన్నీ మంత్రి అజయ్ కి ఆలశ్యంగా తెలిశాయి. అదికూడా అజయ్ ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా అలీం భార్య మంత్రికి కన్నీరు మున్నీరు అవుతూ చెప్పింది . దీనిపై చలించిన మంత్రి వెంటనే ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగివచ్చిన యాజమాన్యం పేషంట్ దగ్గర నుంచి వసూల్ చేసిన డబ్బులో 5 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చివేశారు.వివరాలు ఇలా ఉన్నాయి……
ఖమ్మంలోని లెనిన్ నగర్ చెందిన అలీం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే కోవిడ్ బారిన పడి ఖమ్మంలో ఓ ఆసుపత్రిలో చేరాడు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్ ఎల్ బి నగర్ ప్రాంతంలోని రక్షా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాన్నీ మంత్రి పువ్వాడకు ఆయా ట్విట్టర్ ద్వారా సమాచారం ఇచ్చారు . వెంటనే స్పందించిన మంత్రి వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. వెంటనే ఆసుపత్రి యజమాన్యంకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని, అధిక బిల్లు చెల్లించలేరని చెప్పారు. మంత్రి ఆసుపత్రి యాజమాన్యానికి తెలిజేశారు.అలీం ఆరోగ్య పరిస్థితి విషమించటంతో అక్కడే మృతి చెందాడు.
మంత్రి పర్యటనలో భాగంగా ఖమ్మంలో ఉన్నఅలీం కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లగా వారు ఆసుపత్రి లో యాజమాన్యం వ్యవహరించిన తీరు, జరిగిన విషయం మంత్రికి వివరించారు.
మొత్తం వైద్యం కోసం దాదాపు రూ. 6.40 లక్షలు వసూలు చేశారని, అంత చెల్లించే స్థోమత లేదని ఎంత చెప్పినా వినలేదని బోరుమనని విలపించారు. తాము ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నామని బ్రతిమిలాడిన రూ.2 లక్షలు కడితేనే మృతదేహంను అప్పగిస్తామని కఠినంగా వ్యవహరించారని మంత్రికి చెప్పారు.
దీంతో ఆగ్రహించిన మంత్రి a రక్షా ఆసుపత్రికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజులు వసూలు చేసి ప్రాణంను కాపాడలేకపోయారని, కరోనా పరిస్థితుల్లో అధిక ఫీజులు వసూలు చేయవొద్దు అని ప్రభుత్వం జీఓ ఇచ్చినప్పటికీ ఇలాంటి దోపిడీకి పాల్పడటం సరికాదని, అధిక ఫిజులు వసూలు చేయొద్దు అని హై కోర్ట్ సైతం ఉత్తరాలు ఇచ్చిందని, తక్షణమే చెల్లించిన అదనపు బిల్లును చెల్లించాలని లేని పక్షంలో ఆస్పత్రిపై న్యాయ పరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
చెల్లించిన అధిక బిల్లు వెనక్కి ఇవ్వాలని లేకపోతె చర్యలు తప్పవని హెచ్చరించారు.మంత్రి హెచ్చరికలతో దిగివచ్చిన యాజమాన్యం కట్టించుకున్న మొత్తం సొమ్ము రూ.6.40 లక్షలు లో రూ.1.40 లక్షలు ఆసుపత్రిలో వైద్య ఖర్చులు కాగా రూ.5 లక్షలు తిరిగి ఇచ్చారు.
దీనితో బాధిత కుటుంబంలో కొండంత ధైర్యం నిండింది. మంత్రి పువ్వడ అజయ్ కుమార్ గారి తెగువపట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద కుటుంబం పట్ల మంత్రి సకాలంలో జోక్యం చేసుకోవడం వల్లనే తిరిగి ఆసుపత్రి యాజమాన్యం డబ్బులు వెనక్కి ఇచ్చిందని మంత్రిని పలువురు అభినందించారు.