Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సాగర్ డాం వద్ద యుద్ధ వాతావరణం :భారీగా పోలీసుల మోహ‌రింపు…

సాగర్ డాం వద్ద యుద్ధ వాతావరణం :భారీగా పోలీసుల మోహ‌రింపు
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఫిర్యాదులు
మండిప‌డుతోన్న‌ తెలంగాణ ప్రభుత్వం
గ‌తంలో చోటు చేసుకున్న‌ ఉద్రిక్త ప‌రిస్థితుల దృష్ట్యా చ‌ర్య‌లు

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంతో నాగార్జున సాగర్ డాం వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్నది .దీంతో గతంలో రెండు రాష్ట్రాలకు చెందిన రైతులు సాగర్ డాం వద్దకు చేరుకున్న నేపథ్యంలో అలంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు . ముందు జాగ్రత్త చేర్యగా ఏర్పాటు చేసిన ఈ బందోబస్తుతో సాగర్ డాం పోలిసుల పహారా మధ్య ఉండి . అక్కడ దేశసరి హద్దుల్లో ఉన్నట్లుగా పెద్దఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి.

ఇటీవలకు స్నేహపూర్వకంగా ఉన్న ఇరు రాష్ట్రాల జలజగడం మాటల తూటాలతో వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళింది. ఏపీ సీఎం జగన్ ని మాత్రమే కాకుండా ఆయన తండ్రి దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రేదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని కూడా టీఆర్ యస్ మంత్రులు వదిలి పెట్టకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఇటు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు అనంతరం మీడియా సమావేశంలో మంత్రులు పేర్నినాని ,అనిల్ మాటలపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం ముమ్మాటికీ అక్రమమైనదేనని ధ్వజమెత్తారు . దాని వల్ల తెలంగాణ భూములు ఎండిపోవడం ఖాయమన్నారు . తమకు ఉన్న హక్కు మేరకు ప్రాజెక్టులలో నీటిని జలవిద్యుత్ కు బారాబర్ ఉపయోగిస్తామని స్పష్టం చేశారు.

దీనిపై ఏపీ నీటిపారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ కట్టిన అక్రమ ప్రాజెక్టులపై తాము ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు . ఎలాంటి పర్మిషన్లు లేకుండానే ప్రాజెక్టులు కట్టింది. తెలంగాణ కదా ? అని ప్రశ్నించారు. పైగా ముఖ్యమంత్రి జగన్ పైన ,రాజశేఖర్ రెడ్డి పైన విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణ మంత్రుల లెక్క మాకుకూడా మాటలు వచ్చని తమకు చేతకాని వాళ్ళము కాదని ,వారిప్రాజెక్టు లకు పర్మిషలు అవసరం లేదా ? మాకు రావాల్సిన న్యాయమైన వాటా ప్రకారం నీటిని వాడుకునేందుకు అభ్యంతరం ఏమిటని అన్నారు. జలవిద్యుత్ కు అని చెప్పి సాగునీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ఇది ఆయనంత దుర్మార్గం అని అన్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఫిర్యాదులు వస్తోన్న విష‌యం తెలిసిందే. ఏపీ చ‌ర్య‌ల వ‌ల్ల పర్యావరణ సమస్యలు వస్తాయంటూ తెలంగాణకి చెందిన శ్రీనివాస్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కి ఫిర్యాదు చేయ‌డం, ట్రైబ్యునల్ ఆదేశాలతో కేంద్ర పర్యావరణ శాఖ ఓ కమిటీని నియమించడం వంటివి జ‌రిగాయి. ఏపీ నిర్ణ‌యాల‌పై తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

అయితే, దీనిపై ఏపీ ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే ప‌నులు జరుగుతున్నాయ‌ని అంటోంది. ఈ నేప‌థ్యంలో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ప్ర‌ధాన విద్యుదుత్ప‌త్తి కేంద్రం వ‌ద్ద 100 మంది పోలీసులను మోహ‌రించారు. గ‌తంలో అక్క‌డ చోటు చేసుకున్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని మ‌రోసారి అలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

 

ఇది తెలంగాణ, ఇక్కడ కేసీఆర్ ఉన్నారుమంత్రి జగదీశ్ రెడ్డి మండిపాటు

తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఏపీ పాలకులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఇది తెలంగాణ, ఇక్కడున్నది కేసీఆర్… మీరెవరు మాకు చెప్పడానికి? అంటూ మండిపడ్డారు. శ్రీశైలం జల విద్యుదుత్పత్తి ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. నీళ్లు ఉన్నంతకాలం విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసి తీరుతామని తమ వైఖరిని చాటారు. విద్యుదుత్పత్తి తమ హక్కు అని జగదీశ్ రెడ్డి ఉద్ఘాటించారు.

ఇతర ప్రాంతాల ప్రజలను తాము అతిథుల్లా గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు. అక్కడి ప్రజల బాగోగులపైనే ఏపీ సర్కారుకు శ్రద్ధలేదని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమేనని ఆరోపించారు. దుర్మార్గంగా పోతిరెడ్డిపాడును వెడల్పు చేస్తున్నారని, ఇకనైనా కుప్పిగంతులు ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.

 

Related posts

‘జీ-7’ను చిన్న గ్రూపుగా అభివ‌ర్ణిస్తూ చైనా వ్యాఖ్య‌లు…

Drukpadam

పార్టీ ‘భాష’నే మాట్లాడా.. 2018 నాటి ‘మోదీ’ ట్వీట్ పై ఖుష్బూ!

Drukpadam

దేశంలో అత్యంత సురక్షిత నగరాల జాబితాలో హైద్రాబాద్ కు 3 స్థానం…

Drukpadam

Leave a Comment