Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎస్సీ ఎంపరర్ మెంట్ పథకంపై ఖమ్మం లో కేసీఆర్ కు పాలాభిషేకం…

ఎస్సీ ఎంపరర్ మెంట్ పథకంపై ఖమ్మం లో కేసీఆర్ కు పాలాభిషేకం
-పాల్గొన్న జిల్లా మంత్రి అజయ్ ,ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ , జడ్పీ చైర్మన్ , డీసీసీబీ చైర్మన్
-డప్పుదరులో ఉత్సాహంగా పాల్గొన్న మంత్రి ,ఇతర ప్రజాపతినిధులు
– నాలుగేళ్లలో 40 వేల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం చెప్పడంపై హర్షం వ్యక్తం చేసిన దళిత సంఘాలు

 

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత సాధికారిత పథకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం అంబెడ్కర్ సెంటర్ నిర్వహించిన డప్పుల దరువు, మానవహారంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య , రాములు నాయక్ , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం , వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత సాధికారిత పథకం పై దళిత సంఘాలు నుంచి మంచి స్పందన వ్యక్తం అవుతుంది . ఖమ్మం లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి అజయ్ పాల్గొని డప్పుతో చిందులు వేశారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎస్సీ లకు ఎంపరర్ మెంట్ పెట్టి వారిఅభ్యన్నతికి నాలుగేళ్లలో 40 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం , వెంటనే 1000 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీచేయడంపై దళితసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఖమ్మం లో అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం అంబేత్కర్ సెంటర్ నందు బుధవారం నిర్వహించిన డప్పుల దరువు, మానవహారం కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ,ఎం.ఎల్.ఏ.లు వెంకటవీరయ్య, రాములు నాయక్ ,జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్,డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణంఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జీశ్గుండాల(ఆర్జేసీ)కృష్ణ ….. కార్యక్రమంలో భాగంగా తొలుత మంత్రి పువ్వాడ అంబేత్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్స్ కి పాలాభిషేకం చేశారు… ఈ కార్యక్రమంలో ఆయా దళిత సంఘాల నాయకులు,పలువురు ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు….

Related posts

అస్సాం సీఎంపై ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేసిన భట్టి!

Drukpadam

పీఎం కేర్స్ నిధులపై ఎన్డీటీవీ కథనం …రాహుల్ గాంధీ స్పందన !

Drukpadam

వైసీపీలో జిల్లాల ర‌చ్చ‌.. కోన‌సీమ జిల్లాలో ఎంపీటీసీ స‌హా 38 మంది రాజీనామా!

Drukpadam

Leave a Comment