ప్రాణవాయువు అందిస్తున్న చిరంజీవి అందరికి ఆదర్శప్రాయుడు….
టీఆర్ యస్ నాయకులు శీలం శెట్టి వీరభద్రం
-గతంలోనే చిరంజీవి అనేక సేవాకార్యక్రమాలలో పాల్గొన్నారు
-సేవే ఆయన లక్ష్యంగా బ్లడ్ బ్యాంకు ఏర్పాటు
-తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 50 చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు
పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ, పల్లె ప్రాంతాల వారికి కూడా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా ఉచిత ఆక్సిజన్ సీలిండర్లు అందజేస్తున్నట్లు, ఈ రోజు ఖమ్మం జిల్లా యం వెంకటాయపాలెం వాసి బండారి వెంకటమ్మకు అవసరమైన ఆక్సీజన్ సిలిండర్ ను ఖమ్మం నగర టీఆర్ యస్ నాయకులు స్థానిక మాజీ కార్పొరేటర్ శ్రీ శీలం శెట్టి వీరభద్రం చేతుల మీదుగా అందజేసినట్లు ఖమ్మం చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ బాధ్యులు గుండాల వీరేశ్ గౌడ్, యండి.సాదిక్ అలీ, గంగిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా శీలం శెట్టి మాట్లాడుతూ, కరోనా రక్కసి బారిన పడి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి ప్రాణాలు కాపాడాలనే మహోన్నత సేవ లక్ష్యంతో ఇరు తెలుగు రాష్ట్రాల తో పాటు కర్ణాటక లో సైతం మొత్తంగా దాదాపు 50 ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి వేలాది మందికి చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ద్వార ఊపిరి పోస్తున్న మెగాస్టార్ చిరంజీవి సేవలు అనిర్వచనీయమని అన్నారు.
తెలుగు ప్రజలకు సేవలందించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని, దివిసీమ లో తుఫాను తాకిడికి సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవడం దగ్గరి నుండి…1998 లో ఐ&బ్లడ్ బ్యాంక్ స్థాపించి వేలాది మందికి కంటిచూపులు, లక్షలాది మందికి ప్రాణదానం అందించిన మహోన్నత సేవ దృక్పథం కలిగిన గొప్ప వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు.
వారి బాటలోనే పయనిస్తూ వారు చేపట్టే సేవ కార్యక్రమాలను నిజాయితీగా మారుమూల ప్రాంతాలకు సైతం అందిస్తున్న చిరంజీవి అభిమానులను అభినందించారు.
కరోనా బారిన పడి కోలుకుని ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్న ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు కు చెందిన ఏలేశ్వరపు తిరుపతా చారి మరియు ఖమ్మం జిల్లా తల్లాడ కు చెందిన కుమాళ్ళ కృష్ణ వారి బంధువులు ఆక్సిజన్ సిలిండర్ మరియు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ల కోసం ఖమ్మం చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ వారిని ఈరోజు సంప్రదించగా వారికి ఆక్సిజన్ సిలిండర్ మరియు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉచితంగా అందజేసినట్లు ఖమ్మం జిల్లా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ బాధ్యులు గుండాల వీరేశ్ గౌడ్, యండి.సాదిక్ అలీ, గంగిశెట్టి శ్రీనివాస్, మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘ నాయకులు కే. ఉపేందర్ చౌదరి, కొమ్ము విజేతలు తెలిపారు.