Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

డిల్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క…..

డిల్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క….
– పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సహా ఇంచార్జిలతో సుదీర్ఘ భేటీ
-సోనియా ,రాహుల్ ను కలవనున్న భట్టి
-తెలంగాణాలో పార్టీ పరిస్థితిపై భట్టి వారికీ వివరించే ఛాన్స్

రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో జరుగుతున్నా పరిణామాలపై అధిష్టానం ఆరాతీస్తోంది . అందులో భాగంగా సీనియర్ నేతగా సీఎల్పీ లీడర్ గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క ను పార్టీ హైకమాండ్ ఢిల్లీకి రావాలని పిలిచింది. ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు .

ఢిల్లీ వెళ్లిన భట్టి ముందుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ , సహా ఇంచార్జిలు బోసు రాజు , శ్రీనివాసన్ తదితరులతో సమావేశమైయ్యారు . రాష్ట్రంలో తెలంగాణ లో జరుగుతున్న పరిణామాలపై సీరియస్ గానే వారితో చర్చినట్లు విశ్వసనీయ సమాచారం . రేవంత్ రెడ్డి నియామకంపై భట్టి కూడా అసంతృప్తితో ఉన్నారనే వార్తల నేపథ్యంలో తెలంగాలో కీలక నేతగా సీఎల్పీ లీడర్ గా ఉన్న భట్టి ని బుజ్జగించే పనిలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో భట్టి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది.

సోనియా, రాహుల్ ను కలిసే ఛాన్స్

భట్టి ఇంచార్జిలతోను మరికొందరితోను సమావేశం అయిన తరువాత ,మరికొందరు కీలక నేతలను కలిసినట్లు తెలుస్తుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ , ఎంపీ రాహాల్ గాంధీని కలిసే అవకాశం ఉంది. ఆయన మరో రెండు రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తెలంగాణ లో పార్టీ పరిస్థిపై ఆయన వారితో చర్చించే అవకాశం ఉంది.

లాకప్ డెత్ లో మరణించిన మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని , అందుకు భాద్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కలిసి భట్టి సీఎం ని కలిశారు . భట్టి చేసిన విజ్ఞప్తులకు సీఎం సైతం సానుకూలంగా స్పందించారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం భట్టి సీఎం ను కలవడం కాకతాళీయంగా జరిగిందా ? లేక కావాలని జరిగిందా ? అనేదానిపై రకరకాల ఊహాగానాలు బయలు దేరాయి. దీంతో భట్టి ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ కు దగ్గర అయ్యారని ఆయన టీఆర్ యస్ లో చేరబోతున్నారని వార్తలు పెద్ద ఎత్తున షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

పార్టీలో సీనియర్లకు టీపీసీసీ పదవి ఇవ్వాలని చెప్పిన వారిలో భట్టి కూడా ఉన్నారు. సీనియర్లకు పదవి రాకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు . పార్టీలో అనేకమంది సీనియర్లు అధిష్టానం నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే అధిష్టానంపై , పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పై తీవ్ర విమర్శలు చేశారు. మరికొందరు సీనియర్లు ఈ నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించకపోయినప్పటికీ.. రేవంత్ రెడ్డికి మద్దతు తెలపకుండా మౌనంగా ఉండిపోయారు.

భట్టి ఢిల్లీ పర్యటనలో అధిష్టానం పెద్దలతో ,పార్టీ అధినేత్రి సోనియాగాంధీ , రాహుల్ గాంధీతో ఏమి చర్చిస్తారు. ఎలాంటి హామీతో ఢిల్లీ నుంచి వస్తారనే ఆశక్తి నెలకొన్నది .

 

Related posts

ఆస్తులు ఆదానికి …అప్పులు ప్రజలకు…బీజేపీ విధానాలపై సీఎల్పీ నేత భట్టి ధ్వజం …

Drukpadam

సీఎం ఎవరనేది అధిష్టానానికి కట్టబెట్టిన సీఎల్పీ …ఈనెల 18 మంత్రివర్గ ప్రమాణం …

Drukpadam

బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం.. కార్యాలయ తలుపులు పగులగొట్టి అరెస్ట్!

Drukpadam

Leave a Comment