Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ బృందంలోని ప్రియ!

షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ బృందంలోని ప్రియ!
తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ
వేగంగా సన్నాహాలు
రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తున్న షర్మిల
ఇవాళ లోటస్ పాండ్ లో షర్మిలతో ప్రియ భేటీ

తెలంగాణలో రాజన్న రాజ్యస్థాపనే లక్ష్యంగా వైయస్ షర్మిల ముందుకు సాగుతున్నారు . తెలంగాణాలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎక్కువగా ఉండటంతో తెలంగాణాలో ఆమె పార్టీని పెట్టబోతున్నారు. ఇప్పటీకే పార్టీని ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేయించిన షర్మిల ఈ నెల 8 వతేదీన పార్టీని ఏర్పాటు చేస్తూ అధికారిక ప్రకటన చేయనున్నారు. అందుకోసం ఆమె చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఖమ్మం లో భహిరంగ సభ పెట్టిన షర్మిల కు మంచి స్పందనే వచ్చింది . అన్ని జిల్లాల వైయస్ అభిమానులతో సమావేశాలు నిర్వహించి ఆయా జిల్లాల సమస్యలు తెలుసుకున్నారు. తరువాత రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్యపై ఆమె ఇందిరాపార్క్ లో నిరసన దీక్ష చేపట్టగా ఒకరోజుకే పోలీసులు బలవంతంగా ఆమె దీక్షను భగ్నం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలపై షర్మిల వివిధ ప్రాంతాలలో పర్యటించి వారికీ అండగా నిలిచారు. పార్టీ నిర్మాణంలో భాగంగా ఆమె రాష్ట్ర స్థాయిలోను జిల్లాలలో సమన్వయ కమిటీలను నియమించారు. ఒక పక్కా స్థానిక సమస్యలపై స్పందిస్తూనే మరో పక్కా పార్టీ పేరు ,జెండా , ఎజెండా లపై కసరత్తు చేశారు.

షర్మిల పార్టీకి వ్యూహకర్తను కూడా నియమించుకున్నారు . ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేసిన ప్రియ షర్మిల వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు . గురువారం ప్రియా స్వయంగా షర్మిలను హైద్రాబాద్ లోని లోటస్ పాండ్ లో కలిసినట్లు షర్మిల అనుయాయులు ధ్రువీకరించారు. ప్రియ తమిళనాడులోని తిరువళ్లూరు ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె. ఇవాళ హైదరాబాదులోని లోటస్ పాండ్ నివాసంలో షర్మిలను ప్రియ కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

జులై 8న వైఎస్సార్ పుట్టినరోజు సందర్భంగా షర్మిల తన పార్టీ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. పార్టీ పేరును ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ ( వైయస్సార్ టి పి) గా ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. పార్టీ జెండా రంగు , ఎజెండా లపై కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. పార్టీ ప్రకటన రోజునే పార్టీ విధివిధానాలు , జెండా ఆవిష్కరణ ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Related posts

అసోం సీఎంపై గీతారెడ్డి, రేణుకా చౌదరి ఫిర్యాదు!

Drukpadam

రాజకీయాలపై సంచలనం రేపుతున్న మంత్రి రోజా వ్యాఖ్యలు !

Drukpadam

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓట్ల లెక్క ప్రకారం టీఆర్ యస్ కు ఏకపక్షమే కానీ ….

Drukpadam

Leave a Comment