గాంధీ భవన్ కు వాస్తు దోషం ఉందా?అందుకే మార్పులకు శ్రీకారం చుట్టారా??
రేవంత్ కు పీసీసీ పదవి నేపథ్యంలో గాంధీ భవన్ లో మార్పులు
జులై 7న పదవీ బాధ్యతల స్వీకారం
గాంధీ భవన్ ను పరిశీలించిన వాస్తు నిపుణులు!
వారి సూచనలతో మార్పులు చేర్పులు!
గాంధీ భవన్ కు వాస్తు దోషం ఉందా ? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు రేవంత్ రెడ్డి అభిమానులు . అందువల్లనే ప్రస్తుతం కాంగ్రెస్ కు కలిసి రావడం లేదని , అధికారానికి దూరంగా ఉంటుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ? మరి వాస్తు దోషం ఉంటె కాంగ్రెస్ ఇంతకాలం అధికారంలో ఎలా ఉండగలిగింది అనే ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. ఏమైనా టీపీసీసీ చీఫ్ గా నియమించి బడిన రేవంత్ రెడ్డి ఈ నెల 7 వతేదీన పదవి భాద్యతలు తీసుకుందుకు సిద్ధమైయ్యారు . అందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. మంచి ముహర్తన పదవి స్వీకారం జరిగితే మంచి జరుగుతుందనే నమ్మకం .దానితో పాటు పనిలో పనిగా గాంధీ భవన్ వాస్తు సరిగా లేదని అందుకే కాంగ్రెస్ అధికారణానికి దూరమైందని కొందరి అభిప్రాయం .అందుకే వాస్తు పండితులను పిలిపించారు. వాస్తు దోషాలను సరిచేసే పనిలో ఉన్నారు.
, గాంధీ భవన్ లో పలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా, వాస్తు సిద్ధాంతం ప్రకారం ఈ కొత్త మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గాంధీభవన్ లో కాంగ్రెస్ పతాకాలు విక్రయించే గదితో పాటు, భద్రతా సిబ్బంది గదిని కూడా తొలగించనున్నారు. ఈశాన్యం వైపున ఖాళీగా ఉంచాలన్నది కొత్త పీసీసీ నేతల ఆలోచన! అంతేకాదు, ఆవరణలో గాంధీ విగ్రహం మినహా మరే నిర్మాణాలు ఉండరాదని నేతలు భావిస్తున్నారు. రేవంత్ పీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో పాత గేటు నుంచి వచ్చి, కార్యక్రమం అనంతరం కొత్త గేటు ద్వారా బయటికి వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కాగా, రేవంత్ రెడ్డి జులై 7న గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోబోతున్నారు. ఈ లోపే మార్పులు పూర్తిచేయనున్నారు. ఇప్పటికే కొందరు వాస్తు నిపుణులు గాంధీభవన్ ను పరిశీలించగా, వారి సూచనల మేరకే తాజా మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.