Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీలో తెలంగాణ బోనాలు… హాజరుకానున్న సీఎం జగన్…

ఏపీలో తెలంగాణ బోనాలు… హాజరుకానున్న సీఎం జగన్
-2010 నుంచి ఏపీలోనూ బోనాలు
-బెజవాడ కనకదుర్గమ్మకు బోనాల సమర్పణ
-తాజాగా ఏపీ మంత్రి వెల్లంపల్లిని కలిసిన బోనాల కమిటీ
-ఉత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం

బెజవాడ లో జరగనున్న తెలంగాణ బోనాల పండగకు ఏపీ సీఎం జగన్ హాజరు కానున్నారని ఉత్సవకమిటీ ఉత్సవ కమిటీ తెలిపింది. హైదరాబాద్ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వరంలో ప్రతిసంత్సరం జరిగే ఉత్సవాలకు ముఖ్యమంత్రి వచ్చేందుకు అంగీకరించడంపట్ల ఉత్సవకమిటీ సంతోషాన్ని వ్యక్తం చేసింది.జలజగడం నేపథ్యంలో బోనాల ఉత్సవాలకు ఏపీ సీఎం జగన్ హాజరు కావడం ఆశక్తిగా మారింది.

తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఏడాది ఆషాఢంలో నిర్వహించే ఈ బోనాలు తెలంగాణ ప్రజల భక్తివిశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తాయి. అయితే, తెలంగాణ బోనాలను ఏపీలోనూ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బెజవాడలోనూ బోనాలు జరగనున్నాయి. బోనాల కమిటీ ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం అందించింది. విజయవాడలో నిర్వహించబోయే బోనాల ఉత్సవాలకు ఏపీ సీఎం జగన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టు కమిటీ వెల్లడించింది.

2010 నుంచి భాగ్యనగర్ బోనాల కమిటీ ఆధ్వర్యంలో ఏపీలోనూ బోనాల వేడుకలు చేపడుతున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు బోనాలు సమర్పించడం ద్వారా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. జులై 18న విజయవాడలో బోనాలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది. ఇక్కడి దుర్గమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించనున్నారు.

ఈ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని బత్తుల బల్వంత్ యాదవ్ నేతృత్వంలోని భాగ్యనగర్ బోనాల కమిటీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కోరింది.

దేవాదాయశాఖ కూడా ఇందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు చూడాలని నిర్వహకులు ఆ శాఖ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి , దేవాదాయశాఖ మంత్రి ఈ ఉత్సవాలకు హాజరు కానుండటంతో దేవాదాయశాఖ అప్రమత్తమైంది .

Related posts

అమెరికాలో భారతీయులపై వివక్ష: తేల్చిన సర్వే….

Drukpadam

గ్యాంగ్ రేప్ కేసులో న‌లుగురు నిందితులు మేజ‌ర్లు!

Drukpadam

ఇమ్రాన్‌కు షాక్.. అవిశ్వాస తీర్మానంలో ఓటమి..

Drukpadam

Leave a Comment