Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ధనిక రాష్ట్ర మైతే ఏమిటీ- ఎందుకీ అమ్మకాలు…సీపీఐ

ధనిక రాష్ట్ర మైతే ఏమిటీ ఎందుకీ అమ్మకాలు

జీఓనెంబర్ 13 రద్దుచేయాలి.

కలెక్టరేట్ ఎదుట సి.పి.ఐ ఆందోళన

పోలీసు ఆందోళన కారుల మధ్య తోపులాట


ఖమ్మం : తెలంగాణ ధనిక రాష్ట్రమైతే భూముల అమ్మకాలు ఎందుకు చేపట్టారని సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు బాగం హేమంతరావు ప్రశ్నించారు. వాగ్దానాలు విస్మరించి తెలంగాణలో పాలన సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. జీ.బి.నెం. 13ను రద్దుచేయాలని , పోడు భూములకు పట్టాలివ్వాలని, అర్హులైన వారికి సొంత స్థలాలలో ఇళ్ళనిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం సి.పి.ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు . ప్రదర్శనగా వచ్చిన సి.పి.ఐ శ్రేణులు కలెక్టరేట్ లోపలికి చొచ్చుక పోయందుకు ప్రయత్నించారు. ఒక దశలో పోలీసులకు ఆందోళన కారుల మధ్య తోపులాట జరిగింది.

. ధనిక రాష్ట్ర మైతే ఏమిటీ ఎందుకీ అమ్మకాలుకలెక్టరేట్ ఎదుట సి.పి.ఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో హేమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ భూముల అమ్మకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జి.ఓ.నెం. 13ను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. భూమి సాగడానికి రబ్బర్కాదని భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూమి కాపాడాలని హేమంతరావు కోరారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లాదిరూపాయలుచేతులు మారుతున్నాయని వేలం రూపంలో జరిగే భూవిక్రయాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని హేమంతరావు ఆరోపించారు. పేదలకునివాస స్థలాలు లేవని అయిన పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు వందల, వేల ఎకరాలు కేటాయిస్తున్నారని ఆరోపించారు. వేలంపాటలో భూములు కొనుగోలు చేసివారు లక్షల కోట్ల రూపాయలు సంపాధించుకునేందుకు భూమిని ఉపయోగించుకొని రియలెస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో వేలం పాటలను ప్రారంభించారని సి.పి.ఐ వేలం పాటలను అడ్డుకుంటుందని హేమంతరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నభూములను సాగు చేసుకునేందుకు పేదలకు పంపిణీచేయాలని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న భూములను నివాసస్థలాలకు కేటాయించాలని హేమంతరావు సూచించారు. ధరణి పేరుతో రాష్ట్రప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ధనికులకు తప్ప పేదలకు మేలు చేయలేదన్నారు. ప్రతిగ్రామంలోను చిన్న సన్నకారు రైతులు భూమిపై హక్కు రాక నానా ఇబ్బందులు పడుతున్నారని హేమంతరావు తెలిపారు. ప్రభుత్వం సమగ్ర భూసేర్వేపేరుతో మండలానికి రెండు గ్రామాలకు చేస్తే సమగ్ర సర్వే పూర్తికావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని ఆయన ప్రశ్నించారు. హరితహారం పేరుతో రాష్ట్రప్రభుత్వం పోడు భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తుందని, పేదలను భూమినుండి తరిమే విధానానికి స్వస్తిపలకాలని హేమంతరావుడిమాండ్ చేశారు. రేషన్కార్డులు, ఆసరా పెన్షన్లు తక్షణమే పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తమ విధానం మార్చుకోక పోతే ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సి.పి.ఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రాబాబు, ఎస్.కె.జానిమియా, పోటు కళావతి, ఏపూరి లతాదేవి, సీతామహాలక్ష్మి, మహ్మద్ సలాం, సిద్దినేని కర్ణ కుమార్, మిడికంటి వెంకటరెడ్డి, కొండపర్తి గోవిందరావు, తోట రామాంజనేయులు, జిల్లా నాయకులు దొండపాటి రమేష్, మేకల శ్రీనివాసరావు, యానాలి సాంబశివరెడ్డి, బెజవాడరవి, ఇటికాల రామకృష్ణ, పగిడిపల్లి ఏసు, గాదె లక్ష్మీనారాయణ, మందా వెంకటేశ్వర్లు, మదుపల్లి లక్ష్మణ్, ఏనుగు గాంధీ, నానబాల రామకృష్ణ, బి.శ్రావన్, తాటి నిర్మల, రాసాల మోహన్రావు, పీట్లకృష్ణమూర్తి, యంగల అందరావు, కొంగర రామారావు, చింతాసూరిబాబు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, బానోత్ కిషన్నాయక్, జక్కా నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫోన్లపై నిఘాకు ముగ్గురు అధికారులకు ఏపీ ప్రభుత్వం అనుమతి పొడిగింపు…

Ram Narayana

టర్కీ, సిరియా దేశాల్లో భూకంపాలపై మూడ్రోజుల ముందే హెచ్చరించిన డచ్ పరిశోధకుడు…

Drukpadam

Drukpadam

Leave a Comment