తెలుగు రాష్ట్రాలు

గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి

  • ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ
  • ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2025’కు హాజరుకావాలని ఆహ్వానం
  • డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహణ
  • దావోస్ సమ్మిట్ తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడి

తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు హాజరుకావాల్సిందిగా చంద్రబాబును ఆయన ఆహ్వానించారు. శుక్రవారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా ఈ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈ సదస్సును ప్రపంచ ప్రఖ్యాత దావోస్ సదస్సు తరహాలో నిర్వహిస్తున్నామని చంద్రబాబుకు వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారికంగా ఆహ్వానాన్ని అందించిన కోమటిరెడ్డి, సమ్మిట్ ప్రాధాన్యతను ముఖ్యమంత్రికి తెలియజేశారు. 

Related posts

అజ్ఞాతంలో మోహ‌న్ బాబు.. పోలీసుల గాలింపు…

Ram Narayana

చిరంజీవి ఆ మాటలు ఏ ఉద్దేశంతో అన్నారో!: యాంకర్ శ్యామల!

Ram Narayana

అయ్యప్ప భక్తుల కోసం ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్!

Ram Narayana