ఆంధ్రప్రదేశ్

సిపిఎం నుంచి తమ్మినేని కోటేశ్వరరావు బహిష్కరణ

సిపిఎం నుంచి తమ్మినేని కోటేశ్వరరావు బహిష్కరణ

ఖమ్మం: పార్టీ నిర్ణయాలను, క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న తమ్మినేని కోటేశ్వరావును పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు సిపిఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీకి సంబందం లేకుండా కోటేశ్వరరావు చేసిన చర్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయని, ఆయా సందర్భాలలో అంతర్గతంగా క్రమశిక్షాణ చర్యలు తీసుకున్నప్పటికి ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. ఆయన చేసిన పొరపాటులన సరిదిద్దటానికి అనేక ప్రయత్నాలు చేసిన మార్పు రాలేదని సుదర్శన్ రెడ్డి తెలిపారు. తాజాగా ఏదులా పురం మున్సిపల్ ఎన్నికలలో ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులతో కుమ్మక్కై పార్టీ నిర్ణయానికి భిన్నంగా తన భార్యను పోటీ నుండి ఉపసంహరించి తమ్మినేని కృష్ణయ్య భార్య ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించడమే కాకుండా , తెల్దారు పల్లిలో మిగతా ఇద్దరు పార్టీ అభ్యర్థులను కూడా ఉపసంహరించే ప్రయత్నాo చేశాడని తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

తాడేపల్లిలో సంక్రాంతి వేడుకలు…. హాజరైన సీఎం జగన్ దంపతులు

Ram Narayana

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా?

Drukpadam

మదనపల్లె మార్కెట్లోనే.. కిలో రూ.200 లకు చేరువైన టమాట ధర!

Ram Narayana