ఎంటర్టైన్మెంట్ వార్తలు

శివరామ్‌, అన్విరా దేవి.. రామ్‌చరణ్‌, ఉపాసన కవలల పేర్లు ఇవే!

  • రామ్‌చరణ్‌, ఉపాసన కవలల పేర్లు వెల్లడి
  • తాత చిరంజీవి పేరు కలిసొచ్చేలా మనవడి పేరు
  • 11న కుటుంబ సభ్యుల మధ్య బారసాల కార్యక్రమం
  • పేర్ల వెనుక ఉన్న ప్రత్యేక అర్థాన్ని వివరించిన చరణ్

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌, ఉపాసన కొణిదెల దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తమకు జన్మించిన అబ్బాయికి శివరామ్‌ అని, అమ్మాయికి అన్విరా దేవి అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. జనవరి 31న వీరికి కవలలు (బాబు, పాప) జన్మించిన విషయం తెలిసిందే.

11న హైదరాబాద్‌లోని వారి నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ చిన్నారుల బారసాల కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్‌చరణ్‌ ఈ పేర్ల వెనుక ఉన్న అర్థాలను, వాటి ప్రాముఖ్యతను వివరించారు.

కుమారుడి పేరు ‘శివరామ్‌’లో శివుడు, రాముడితో పాటు తన తండ్రి చిరంజీవి అసలు పేరు ‘శివ శంకర వరప్రసాద్’ కూడా కలగలిసి ఉందని తెలిపారు. కుమార్తె పేరు ‘అన్విరా దేవి’కి అపరిమితమైన ధైర్యం, దైవికమైన స్త్రీ శక్తి అని అర్థం వచ్చేలా పెట్టామని ఆయన పేర్కొన్నారు. తమ తల్లిదండ్రుల ఆశీస్సులతో, వారి భాగస్వామ్యంతో ఈ పేర్లను ఎంపిక చేశామని చరణ్ అన్నారు. 2023లో జన్మించిన క్లింకారా తర్వాత, చరణ్-ఉపాసన దంపతులకు శివరామ్, అన్విరా రెండో, మూడో సంతానం. 

Related posts

రాజకీయాల్లో చిరంజీవి సీనియర్.. సినిమాల్లో జూనియర్: కమల్ హాసన్

Ram Narayana

ఈ వయసులో ఆ పాడుబుద్దులేంటి గోవిందా..? భార్య సునీత ఫైర్

Ram Narayana

విజయ్ తో వైరంపై స్పందించిన అజిత్…

Ram Narayana