ఇందిరమ్మ రాజ్యమంటే ఇల్లు కూల్చడమా …కేటీఆర్ ఆగ్రహం
ఇందిరమ్మ రాజ్యమంటే ఇల్లు కూల్చడమా …కేటీఆర్ ఆగ్రహం
ముగ్గురు మంత్రులు ఉన్న ఒక్కరు బయటకొచ్చి సమాధానం చెప్పలేదు ..కేటీఆర్
అక్రమ కూల్చివేతల గురించి శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం – కేటీఆర్
శత్రుదేశం మీద దండ యాత్రకి పోయినట్లు 4000 మంది పోలీసులతో దాడి చేశారు – కేటీఆర్
నేను మిమ్మల్ని పరామర్శించి అండగా ఉండడానికి వస్తుంటే పోలీసులను పెట్టి నన్ను ఆపే ప్రయత్నం చేశారు
రాత్రికి రాత్రి ఆర్డిఓ ని ట్రాన్సఫర్ చేసి తప్పించుకోవాలని చూస్తున్నారు
ఖమ్మం భుదాన్ ఇండ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించిన బిఆర్ఎస్ కేటీఆర్ , మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఎంపీ వద్ది రాజు , ఎమ్మెల్సీ తాతా మధు

భూదాన్ భూముల్లో పేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చడంపై కేటీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు … ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అంటూ నిలదీశారు ..ఇందుకోసమేనా అధికారంలోకి వచ్చిందని ప్రశ్నించారు ..అక్రమ కూల్చివేతలపై ఈ ప్రభుత్వాన్ని వదిలే సమస్యే లేదని అన్నారు ..శాసనసభ , మండలిలో ఈ ప్రభుత్వ చర్యలను ఎండగడతామని హామీ ఇచ్చారు ..న్యాయపోరాటం సైతం చేస్తామని అంతిమంగా ఇక్కడ భాదితులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదని భరోసా ఇచ్చారు ..అరె ఇదెక్కడి న్యాయం ఎక్కడైనా ఉందా …పాపం లక్షలాది రూపాయలు అప్పు సప్పు చేసి కట్టుకున్న పక్క భవనాలు కూల్చాలని ఈ ప్రభుత్వ పెద్దలకు ఎక్కడనుంచి వచ్చింది ..ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తామని అంటున్నారు …ఇక్కడ నివసిస్తుంది ప్రజలు కదా ..?అని కేటీఆర్ ఫైర్ అయ్యారు …
ఇక్కడే కాదు రెండున్నరేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పేదల ఇండ్లు కూలగొట్టింది కాంగ్రెస్ సర్కార్ అని ఎలాగా వారి చర్యలు కొనసాగితే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు .. ఇందిరమ్మ రాజ్యం … ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమేనా? అని అన్నారు ..ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇల్లు కూలగొట్టిందో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడే ఇల్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ తన మాటగా చెప్పమన్నారని కేటీఆర్ అన్నారు ..
శత్రుదేశం మీదకు దండయాత్రకు వెళ్లినట్లు 4 వేలమందిని పోలీసులను వెంట పెట్టుకొని అర్ధరాత్రి వచ్చి కూల్చడం కట్టుబట్టలతో సహా వాళ్ళను నడిరోడ్డు పై వేయడం దుర్మార్గం అని ప్రభుత్వ చర్యలపై విమర్శలు గుప్పించారు ..జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఏమి చేస్తున్నారని వాళ్ళు తప్పు చేయకపోయేట్ బయటకు వచ్చి మాట్లాడాలని అన్నారు ..ఇళ్ల కూల్చివేతకు ఆర్డీఓ ను బదిలీ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని అన్నారు ..
ఖమ్మం వెలుగుమట్లలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ఇళ్ల కూల్చివేత బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించిన సమయంలో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. బాధితులు తమ కన్నీళ్లను ఆపుకుంటూ, తమ వద్ద ఉన్న భూమి పట్టా కాగితాలు, ప్రభుత్వానికి కట్టిన ఆస్తి పన్ను రశీదులు, ఇంటి పన్ను కాగితాలు మరియు విద్యుత్ కనెక్షన్ కోసం కట్టిన డీడీలను కేటీఆర్ కి చూపించారు.
“అన్నా, ఇవన్నీ ప్రభుత్వమే ఇచ్చిన కాగితాలు కదా, మరి మా ఇళ్లను ఎలా కూలుస్తారు?” అంటూ వారు తమ ఆవేదనను వెళ్లగక్కారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో జీవోల ప్రకారం దరఖాస్తు చేసుకుని, ఎలాంటి ఇబ్బంది లేకుండా నివసిస్తున్న తమను, ప్రస్తుత ప్రభుత్వం అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా ఖాళీ చేయించిందని వారు వాపోయారు.
ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్ ఆగ్రహం
బాధితుల వద్ద ఉన్న అన్ని రకాల ధృవీకరణ పత్రాలను పరిశీలించిన కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిన “ఇందిరమ్మ రాజ్యం”లో, ఉన్న ఇళ్లను కూలగొట్టడం అన్యాయమని ధ్వజమెత్తారు. ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు మరియు కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ, కనీస నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయడం అమానుషమని ఆయన విమర్శించారు. ఖమ్మంలో 150 ఇళ్లతో పాటు, మహబూబ్ నగర్లో దివ్యాంగుల ఇళ్లను కూడా కూల్చివేయడం ఈ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. కేవలం ఆర్డీవోను బదిలీ చేస్తే సరిపోదని, బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
బాధితులకు భరోసా మరియు పునరావాస హామీ
కూల్చివేతకు గురైన కుటుంబాలకు కేటీఆర్ అండగా నిలిచారు. “మీరు ఎవరూ అధైర్యపడకండి, ఏడవకండి.. మీ అందరికీ మళ్ళీ ఇదే స్థలంలో ఇళ్లు కట్టించి, గృహప్రవేశాలు చేయించే బాధ్యత నాది” అని ఆయన హామీ ఇచ్చారు. ఈ పోరాటంలో భాగంగా కలెక్టర్ మరియు చీఫ్ సెక్రటరీలను కలిసి బాధితుల పక్షాన నిలబడతామని చెప్పారు. శాసనసభ, శాసనమండలి వేదికలుగా ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పేదల పక్షాన పోరాడాలని కేసీఆర్ ప్రత్యేకంగా చెప్పారని, బాధితులు ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు.
న్యాయ పోరాటంపై స్పష్టత
ప్రభుత్వం బాధితులను విడదీసే ప్రయత్నం చేస్తుందని, కానీ అందరూ కలిసికట్టుగా ఉంటేనే విజయం సాధించగలమని కేటీఆర్ సూచించారు. కలెక్టర్ తమతో అబద్ధాలు చెప్పారని బాధిత మహిళలు ఫిర్యాదు చేయగా, అధికారులు మరియు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడతామని ఆయన భరోసా ఇచ్చారు. చట్టపరమైన అన్ని ఆధారాలు బాధితుల వైపు ఉన్నాయని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ వారికి ధైర్యం చెప్పారు .
భూదాన్ భూముల్లో పేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చడంపై కేటీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు … ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అంటూ నిలదీశారు ..ఇందుకోసమేనా అధికారంలోకి వచ్చిందని ప్రశ్నించారు ..అక్రమ కూల్చివేతలపై ఈ ప్రభుత్వాన్ని వదిలే సమస్యే లేదని అన్నారు ..శాసనసభ , మండలిలో ఈ ప్రభుత్వ చర్యలను ఎండగడతామని హామీ ఇచ్చారు ..న్యాయపోరాటం సైతం చేస్తామని అంతిమంగా ఇక్కడ భాదితులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదని భరోసా ఇచ్చారు ..అరె ఇదెక్కడి న్యాయం ఎక్కడైనా ఉందా …పాపం లక్షలాది రూపాయలు అప్పు సప్పు చేసి కట్టుకున్న పక్క భవనాలు కూల్చాలని ఈ ప్రభుత్వ పెద్దలకు ఎక్కడనుంచి వచ్చింది ..ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తామని అంటున్నారు …ఇక్కడ నివసిస్తుంది ప్రజలు కదా ..?అని కేటీఆర్ ఫైర్ అయ్యారు …
ఇక్కడే కాదు రెండున్నరేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పేదల ఇండ్లు కూలగొట్టింది కాంగ్రెస్ సర్కార్ అని ఎలాగా వారి చర్యలు కొనసాగితే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు .. ఇందిరమ్మ రాజ్యం … ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమేనా? అని అన్నారు ..ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇల్లు కూలగొట్టిందో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడే ఇల్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ తన మాటగా చెప్పమన్నారని కేటీఆర్ అన్నారు ..
శత్రుదేశం మీదకు దండయాత్రకు వెళ్లినట్లు 4 వేలమందిని పోలీసులను వెంట పెట్టుకొని అర్ధరాత్రి వచ్చి కూల్చడం కట్టుబట్టలతో సహా వాళ్ళను నడిరోడ్డు పై వేయడం దుర్మార్గం అని ప్రభుత్వ చర్యలపై విమర్శలు గుప్పించారు ..జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఏమి చేస్తున్నారని వాళ్ళు తప్పు చేయకపోయేట్ బయటకు వచ్చి మాట్లాడాలని అన్నారు ..ఇళ్ల కూల్చివేతకు ఆర్డీఓ ను బదిలీ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని అన్నారు ..
తన వెలుగుమట్ల భాదితులను పరామర్శించేందుకు ఖమ్మం వస్తుంటే నన్ను కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని అన్నారు
వారి దగ్గర స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు చట్టబద్ధంగా ఉన్నాయి
ఇవి కచ్చితంగా అక్రమకు కూల్చడాలే అవుతాయని న్యాయపోరాటం తప్పదని అన్నారు . తప్పకుండా చట్ట పరంగా మీకోసం పోరాడుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు ..బుదాన్ బాధితులకు అండగా ఉంటాం..కేసీఆర్ చెప్పి పంపారు మరలా మనం అధికారంలోకి వస్తున్నాం ఇదే జాగాలో మీకు పక్కా ఇల్లు కట్టిస్తామని అన్నారు .

కెసిఆర్ సార్ చెప్పమన్నాడు మన ప్రభుత్వం వచ్చాక ఖమ్మం వెలుగుమట్లలో ఎక్కడైతే మీరు ఇల్లు కోల్పోయారో అక్కడే మళ్ళీ ఇచ్చి గృహప్రవేశం చేపించే బాధ్యత మాది కేటీఆర్ అన్నారు .
నేను నేను రాజకీయాల కోసం ఖమ్మం కి రాలేదు ఇప్పుడు ఏ ఓట్లు లేవు మీకు నిలువ నీడ లేకుండా చేసింది ఈ కాంగ్రేస్ పార్టీ,
మీకు బిఆర్ఎస్ అండగా ఉంటుందిని భరోసా కల్పించడానికే వచ్చానని అన్నారు …ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ , ఎంపీ వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు తాతా మధు తదితరులు పాల్గొన్నారు ..
వెలుగుమట్ల భూములపై కలెక్టర్ ను కలిసిన సిపిఐ సిపిఎం లు
సిపిఐ, సిపిఎం పార్టీలు వెలుగుమట్ల భూదాన భూముల్లో ఇల్లు కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చడాన్ని తీవ్రంగా ఖండించారు …వారికీ అక్కడే ఇల్లు కట్టించి న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు …
పోటు రంగారావు …సిపిఐ (ఎం ఎల్) మాస్ లైన్
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని నిరుపేద గుడిసె వాసులకు ఇంటి స్థలం కేటాయించి పక్క ఇల్లు నిర్మించాలని CPI (ML) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు