ఎంటర్టైన్మెంట్ వార్తలు

అన్నయ్య చిరంజీవికి అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్…

  • మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు దక్కడంపై సంతోషం
  • అన్నయ్య ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడిన వైనం
  • కమల్ హసన్, జయసుధ సహా అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు
  • సినీ రంగానికి వారు చేసిన సేవలు ఎంతో విలువైనవని ప్రశంస

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన చలన చిత్ర అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ దక్కడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన సోదరుడు చిరంజీవికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో అన్నయ్య చిరంజీవి ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పవన్ కొనియాడారు.

చిరంజీవితో పాటు వివిధ విభాగాల్లో పురస్కారాలకు ఎంపికైన సినీ ప్రముఖులకు కూడా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. పైడి జైరాజ్, బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, టీఎల్ కాంతారావు, రఘుపతి వెంకయ్య, సి.నారాయణరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు గార్ల పేరిట ఉన్న పురస్కారాలకు ఎంపికైన కమల్ హసన్, సింగీతం శ్రీనివాసరావు, అశ్వినీదత్, ఆర్.నారాయణమూర్తి, రమేశ్ ప్రసాద్, సుద్దాల అశోక్ తేజ, జయసుధలకు ఆయన అభినందనలు తెలిపారు.

ఈ పురస్కారాలకు ఎంపికైన వారంతా చిత్ర పరిశ్రమకు అందించిన సేవలు ఎంతో విలువైనవని పవన్ పేర్కొన్నారు. అలాగే గద్దర్ పురస్కారాలకు ఎంపికైన వారికి కూడా పవన్ కల్యాణ్ తన అభినందనలు తెలియజేశారు.

Related posts

ఓటీటీలో ఈ వారం సినిమాలు…

Ram Narayana

నేడు బిగ్‌బాస్-8కు ఎండ్ కార్డ్.. 300 మంది పోలీసులతో భారీ భద్రత!

Ram Narayana

శిల్పీనీవే! శిల్పమునీవే! సృష్ఠిలో

Ram Narayana