తెలంగాణ రాజకీయ వార్తలు ..

రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ ఏకగ్రీవం

  • రాజ్యసభ సభ్యులుగా తెలంగాణ  నుంచి ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ
  • ఇద్దరికీ ధృవపత్రాలు అందించిన రిటర్నింగ్ అధికారి
  • సమస్యలను పరిష్కరించి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్న వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ సమస్యలను రాజ్యసభలో, ఢిల్లీలో వినిపిస్తానని రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇద్దరికీ రిటర్నింగ్ అధికారి ధృవపత్రాలను అందించారు.

ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సమస్యలను రాజ్యసభలో, ఢిల్లీలో వినిపించి వాటిని పరిష్కరించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తానని అన్నారు.

Related posts

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఈ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం: వైఎస్ షర్మిల

Ram Narayana

కేటీఆర్, హరీశ్‌రావువి అన్నీ అబద్ధాలే: కాళేశ్వరం వైఫల్యాలపై మంత్రి పొంగులేటి

Ram Narayana

ముషీరాబాద్ నుంచి పోటీ …కాంగ్రెస్ నేత అంజాన్ కుమార్ యాదవ్ …!

Ram Narayana