Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భూదాన్ పోచంపల్లిని పర్యాటక ,సంస్కృత కేంద్రంగా అభివృద్ధి చేయాలి :బీజేపీ కొర్ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి!

భూదాన్ పోచంపల్లిని పర్యాటక ,సంస్కృత కేంద్రంగా అభివృద్ధి చేయాలి :బీజేపీ కొర్ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి
-వోకల్ ఫర్ లోకల్ నినాదం చేనేతను ప్రోత్సహించండి :
-ప్రధాని పిలుపు మేరకు చేనేత బజార్లు ఏర్పాటు చేయాలి
-అందరు చేనేత దుస్తులు ధరించాలి

భూదాన్ పోచంపల్లిని పర్యాటక సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనీ డిమాండ్ చేశారు.
జాతీయ చేనేత దినోత్సవం ను పురస్కరించుకునిబిజెపి కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ,తమిళ నాడు రాష్ట్ర పార్టీ జాతీయ కోర్ కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం భువనగిరి యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామం ను సందర్శించారు వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు చేనేతను ప్రోత్సహించటంతో పటు చేనేత బజార్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. అందరం చేనేత దుస్తులను ధరించాలని ఆయన పిలుపు నిచ్చారు. కేంద్రప్రభుత్వం సైతం చేతను ఆదుకునేందుకు చేనేత జౌళి శాఖా ఆధ్వరంలో చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

..స్థానిక పార్టీ నేతల తో కలిసి చేనేత కార్మికుల ఇళ్ల కు వెళ్లి వారి బాగోగులు వాకబు చేసారు..వారికి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కే కే నగర్ లో వేముల సత్యం అనే నేతన్న వద్ద బట్టలు కొనుగోలు చేశారు..అందరం చేనేత దుస్తులు ధరించి నేతన్న లకు అండగా నిలవాలని కోరారు..చేనేత కార్మికుల సమస్య లను పరిష్కారించాలని ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూదాన్ పోచంపల్లి ని పర్యాటక సాంస్కృతిక కేంద్రం గా అభివృద్ధి చేయాలని కోరారు..ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పిలుపు మేరకు వోకల్ ఫర్ లోకల్ నినాదం తో చేనేత ను ప్రోత్సహించాలనికోరారు..కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక నేతలు ఎన్నం శివకుమార్, నోముల గణేష్, చిక్కంతా కృష్ణ ,ఎస్ రంగారెడ్డి, కే నర్సింహ ,చొక్కా రెడ్డి, ఆర్ సత్యనారాయణ, టి రమేష్ లు పాల్గొన్నారు

Related posts

నిమ్స్ ఆస్పత్రిలో కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు:మంత్రి హరీష్ రావు

Drukpadam

గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి.. వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Ram Narayana

ఐటీ కంపెనీ ల వర్క్ ఫ్రం హోమ్ పై తర్జన భర్జనలు …వ‌ర్క్ ఫ్రం హోం కు తెలంగాణ నో!

Drukpadam

Leave a Comment