తెలుగు రాష్ట్రాలు

గోదావరికి స్నానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతు …

భద్రాచలం సమీపంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు అయిన విషాద సంఘటన చోటు చేసుకుంది .. భద్రాచలం పట్టణ శివారు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్నది ఈ ఘటన …శుక్రవారం మధ్యాహ్నం గోదావరిలోకి స్నానానికి దిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు… అందులో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం కాగా మరో రెండు మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు ..

భద్రాచలానికి చెందిన ఇద్దరు విద్యార్థులతో పాటు ఏపీ రాజధాని అమరావతిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు. నాలుగు రోజులు వారాంతపు సెలవులు రావడంతో భద్రాచలానికి చెందిన స్నేహితులతో కలిసి భద్రాచలం వచ్చిన విద్యార్థులు.
గల్లంతైయిన విద్యార్థులు సతీష్ (మదనపల్లి),నవదీప్ (ఉయ్యూరు),తేజజ్ఞ (ఉయ్యూరు),అభిరామ్,శ్రీకర్ (భద్రాచలం) గా గుర్తింపు.

భద్రాచలానికి చెందిన శ్రీకర్, అభిరామ్, ఉయ్యూరు కు చెందిన నవదీప్ మృతదేహాలు లభ్యం కాగా సతీష్ , తేజాజ్ఞ మృత దేహాలు లభ్యం కావాల్సి ఉంది ..తమ వారి మృతదేహాల వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులు…

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Godavari River Tragedy Five Engineering Students Drowned in Polavaram

పోలీసుల వివరాల ప్రకారం, అమరావతిలోని ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఉగాది సెలవుల సందర్భంగా విహారయాత్రకు వెళ్లారు. భద్రాచలం సందర్శన అనంతరం ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగారు. నది లోతుపై అవగాహన లేకపోవడంతో నీటి ప్రవాహానికి ఐదుగురు కొట్టుకుపోయారు. మరో ఇద్దరు విద్యార్థులు చాకచక్యంగా ఒడ్డుకు చేరుకున్నారు.

సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు పడవల సాయంతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సి. శ్రీకర్ (భద్రాచలం), పి. అభిరామ్ (విజయనగరం), నవదీప్ (ఉయ్యూరు) మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన గోక తేజ (ఉయ్యూరు), పాశం సతీష్ కుమార్ (మదనపల్లె) కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదం నుంచి బయటపడిన వారిని చందూరి దీపక్, గడ్డం హర్షవర్ధన్‌గా గుర్తించారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Related posts

ఏపీ, తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ!

Ram Narayana

నారా లోకేశ్-అమిత్ షా భేటీలో తన పాత్రపై కిషన్ రెడ్డి క్లారిటీ

Ram Narayana

దేవరగట్టు బన్నీ ఉత్సవం .. కర్రల సమరంలో 100 మందికి గాయాలు

Ram Narayana