అంతర్జాతీయం

నాటో  కి  ట్రంప్ గుడ్ బై…?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాటో సైనిక కూటమిపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ కూటమిని తాను ఎప్పుడు పరిగణలోకి తీసుకోలేదని అది ఒక కాగితపులేని రంపునూరు పారేసుకున్నాడు. తాను నాటో  కూటమికి గుడ్ బై చెప్పినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు…    

నాటో ఒక ‘కాగితపు పులి’ అని అభివర్ణిస్తూ, కూటమి నుంచి వైదొలగే విషయం పునఃపరిశీలన స్థాయి కూడా దాటిపోయింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో సైనిక ఘర్షణ విషయంలో యూరప్ మిత్రదేశాలు మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇరాన్‌తో యుద్ధం, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు నాటో దేశాలు ముందుకు రాకపోవడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఈ విషయంలో మిత్రదేశాలు ‘పిరికిపందలు’ అంటూ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఘాటుగా పోస్ట్ చేశారు. 

బ్రిటన్‌కు చెందిన ‘ది టెలిగ్రాఫ్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, నాటో నుంచి వైదొలగడం గురించి మాట్లాడుతూ, “అవును, ఈ విషయం గురించి ఇక ఆలోచించడానికేమీ లేదు. నేను నాటోను ఎప్పుడూ కాగితపు పులిగానే చూశాను, ఈ విషయం పుతిన్‌కు కూడా తెలుసు” అని స్పష్టం చేశారు.

“మేం ఉక్రెయిన్ విషయంలో వారికి (నాటో దేశాలకు) అండగా నిలిచాం. కానీ ఇరాన్ విషయంలో వారు మాకు మద్దతుగా నిలవలేదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా మద్దతు తెలిపారు. “మనకు అవసరమైనప్పుడు సైనిక స్థావరాలను నిరాకరించే మిత్రదేశాలతో కూటమి వల్ల ప్రయోజనం ఏమిటి?” అని ప్రశ్నించారు. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ సైనిక స్థావరాలను, గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి అమెరికాకు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.

మిత్రదేశాల వైఖరితో 77 ఏళ్ల నాటి నాటో కూటమి భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఈ పరిణామాలపై ఇరాన్ విషయంలో బుధవారం రాత్రి ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. దీంతో ఆయన ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related posts

మోదీని బెదిరించడం వల్లే యుద్ధం ఆగింది.. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యల…

Ram Narayana

అమెరికాలో భారత యువతి అదృశ్యం .. పెళ్లి కోసం వచ్చి గల్లంతు!

Ram Narayana

నేపాల్ నేతల వారసుల లగ్జరీ లైఫ్ స్టయిల్… ప్రజాగ్రహం వెనుక ఇదీ ఓ కారణం!

Ram Narayana