బండి సంజయ్ కు చురకలంటించిన మంత్రి కేటీఆర్!
-బీజేపీ ‘దరఖాస్తుల ఉద్యమం’ చేపట్టిందంటూ బండి సంజయ్ ట్వీట్
-బీజేపీని ఇరుకున పెట్టేలా కేటీఆర్ రిప్లై
-ప్రధాని మోదీ 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీని గుర్తు చేసిన కేటీఆర్
-ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు ఇవ్వడానికి దరఖాస్తులు అంటూ ఎద్దేవా
హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. విమర్శలు ప్రతివిమర్శలతో ఒక్కసారిగా రాష్ట్రరాజకీయవతారణం మారిపోయింది. దళిత బందు ఆయుధంగా అధికార టీఆర్ యస్ ప్రతిపక్షాలను కోలుకోకుండా దెబ్బతీసేందుకు పథకరచన చేస్తుండగా ప్రతిపక్షాలు అందుకు దీటుగా దళిత బందు కేవలం హుజురాబాద్ కు మాత్రమే కాకుండా రాష్ట్రమంతటా అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీ దళిత,గిరిజన ఆత్మగౌరవ పేరుతొ సభలు నిర్వహిస్తుండగా ,బీజేపీ దళిత బందు కోసం దారక్షిస్తులను ఆహ్వానిస్తుంది. దీంతో మంత్రి కేటీఆర్ బీజేపీ దరఖాస్తుల ఆహ్వానంపై బీజేపీ కి చురకలు అంటించారు. 2014 ఎన్నికల సందర్భంగా ప్రతి వారికీ 15 లక్షల రూపాయలు బదిలీ చేస్తానన్న మోడీ వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చేసిన అనేక వాగ్దానాలను గాలికి వదిలేసినా విషయం గాలికి వదిలేశారని విమర్శించారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ చురకలంటించారు. సర్కారు పథకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ ‘దరఖాస్తుల ఉద్యమం’ చేపట్టింది. కరీంనగర్‌లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు బండి సంజయ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దానిపై స్పందించిన కేటీఆర్ బీజేపీని ఇరుకున పెట్టేలా ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దేశంలోని ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు ఇవ్వడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నానంటూ చురకలంటించారు. అర్హులైన రాష్ట్ర ప్రజలంతా తమ జన్‌ధన్ ఖాతాల్లో ధనాధన్ డబ్బులు పడేందుకు బీజేపీ నేతలకు దరఖాస్తులు పంపాలని ఎద్దేవా చేశారు.