తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఉద్యమం చేసిన సాధించిన తెలంగాణను తేజస్వీ అవమానించారు: పొన్నం ప్రభాకర్

  • తేజస్వీ మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు నోరు మెదపలేదని విమర్శ
  • తేజస్వీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్
  • మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతిస్తుందని వ్యాఖ్య

దశాబ్దాలుగా ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణను బీజేపీ కర్ణాటక ఎంపీ తేజస్వీ సూర్య అవమానించారని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన అవమానిస్తుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు నోరు కూడా మెదపలేదని విమర్శించారు. తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ రికార్డుల్లో ఉండకూడదని డిమాండ్ చేశారు.

డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని మంత్రి అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో కలపకుంటే కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమి మద్దతిస్తుందని హామీ ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా డీలిమిటేషన్‌తో కలిపి మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిందని పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.

Related posts

బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించింది.. కొత్తగూడెంలో వారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాం: కేటీఆర్

Ram Narayana

రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన వద్దిరాజు రవిచంద్ర, తాతామధు

Ram Narayana

ప్రజల దృష్టి మరల్చేందుకే నాపై రేవంత్ రెడ్డి ఆరోపణలు: కిషన్ రెడ్డి

Ram Narayana